News July 10, 2024

వాట్సాప్‌లో త్వరలో కొత్త ఫీచర్

image

వాట్సాప్‌లో త్వరలో ‘జూమ్ కంట్రోల్స్ ఫర్ ది కెమెరా’ అనే ఫీచర్ రానుంది. ఫీచర్‌లో భాగంగా యాప్‌లో కెమెరా రికార్డింగ్ దగ్గర బటన్‌ను తీసుకురానున్నారు. దీనిని ఉపయోగించి యూజర్లు తమకు అవసరమైనంత వరకు కెమెరాను జూమ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం స్క్రీన్‌పై స్వైప్ చేసి జూమ్ చేసే ఆప్షన్ ఉంది. కానీ కొత్త ఫీచర్‌తో సులభంగా కచ్చితమైన జూమింగ్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని వాబీటా ఇన్ఫో వెల్లడించింది.

Similar News

News March 31, 2026

పీరియడ్స్ వాయిదాకు పిల్స్ వాడుతున్నారా?

image

పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పండుగల్లో ఇబ్బంది పడకుండా మహిళలు పీరియడ్స్‌‌ను తాత్కాలికంగా వాయిదా వేసే మాత్రలను వాడటం పెరిగింది. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘వీటిని తరచూ వేసుకొంటే హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది. నెలసరి క్రమం తప్పుతుంది. తలనొప్పి, వికారం, రొమ్ములో గడ్డలు, బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయి. కొందరికి హార్ట్ అటాక్‌ ముప్పూ ఉంటుంది’ అని చెబుతున్నారు.
#ShareIt

News March 31, 2026

BREAKING: తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఉదయం <<19521864>>పెరిగిన<<>> బంగారం ధరలు సాయంత్రానికి తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై 600 తగ్గి రూ.1,48,690, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.550 తగ్గి రూ.1,36,300 పలుకుతోంది. అటు కిలో వెండి రూ.2,50,000 వద్ద కొనసాగుతోంది.

News March 31, 2026

YouTubeలో ‘ధురంధర్‌-2’ కలకలం

image

బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న ధురంధర్-2 మూవీ YouTubeలో ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. దీన్ని గమనించిన ఆ మూవీ ఫ్యాన్స్ SMలో పోస్టులు పెట్టారు. దీంతో అప్రమత్తమైన మూవీ టీమ్ పైరసీపై యూట్యూబ్‌ను సంప్రదించింది. వెంటనే స్పందించిన YouTube ఆ వీడియోను తొలగించింది. దీంతో మేకర్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 19న రిలీజైన మూవీ రూ.1,300+కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.