News July 10, 2024
HYD: హోటళ్లు, రెస్టారెంట్లపై ఇలా ఫిర్యాదు చేయండి.!

HYD, RR, MDCL,VKB జిల్లాల్లోని హోటళ్లు, రెస్టారెంట్‌లు, చాయ్ బండ్లు, పానీపూరి బండ్లలో పాడైన ఆహారాన్ని విక్రయించడం, బిర్యానీలో బొద్దింక, పూరిలో గుండు పిన్ను లాంటివి రావడంతో పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. కలుషిత ఆహారాన్ని గుర్తిస్తే వాట్సాప్ నం. 9100105795, 040-21111111, మెయిల్, ‘X’లో తెలియజేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఫిర్యాదు అందితే వెంటనే తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు.SHARE IT
Similar News
News November 8, 2025
హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు లేదు: HMRL

HYD మెట్రో ఛార్జీల పెంపు అని వస్తోన్న వార్తలపై HMRL క్లారిటీ ఇచ్చింది. తక్షణమే ఛార్జీలు పెంచే ఆలోచన లేదని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలతోనే మెట్రో సేవలు కొనసాగనున్నాయని స్పష్టం చేశారు. కేంద్రం ఏర్పాటు చేసిన ఛార్జీల నిర్ధారణ కమిటీ సిఫారసుల ఆధారంగా మే 24, 2025 నుంచి ఛార్జీల సవరణ అమలు చేశామని గుర్తు చేశారు. ఛార్జీల పెంపు అవాస్తవమని FactCheck_Telangana ధ్రువీకరించింది.
SHARE IT
News November 8, 2025
హైదరాబాద్ మాజీ క్రికెటర్‌కు అరుదైన గౌవరం

మిథాలి రాజ్.. హైదరాబాదీ మాజీ క్రికెటర్.. మహిళా క్రికెట్‌లో ఎన్నో సంచలనాలు నమోదు చేసిన గొప్ప క్రీడాకారిణి. వివిధ మ్యాచ్‌లో గెలిపించి భారత క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్న బ్యాట్స్ ఉమెన్.. ఇప్పడు మిథాలికి అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీలో జరిగిన సమావేశంలో మిథాలికి ఐసీసీ ఉమెన్ క్రికెట్ కమిటీలో చోటు కల్పించింది. దీంతో హైదరాబాద్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News November 8, 2025
జూబ్లీ బైపోల్: చనిపోయిన ఓటర్ల వివరాల సేకరణ

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈసారి వివిధ పార్టీల కార్యకర్తలు మరణించిన ఓటర్ల వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఎంతమంది మరణించారు.. ఎంతమందికి ఇక్కడ ఓట్లు ఉన్నాయి అనే విషయాలు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే పోలింగ్ రోజు ఎవరైనా మృతి చెందిన ఓటరు పేరున వచ్చి ఓటు వేసే ప్రమాదముండటంతో ముందుజాగ్రత్త చర్యగా.. పోలింగ్ కేంద్రంలో అడ్డుకునేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.


