News July 10, 2024
16న కేబినెట్ భేటీ

AP: ఏపీ కేబినెట్ ఈ నెల 16న సమావేశం కానుంది. ఆరోజు ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంలో జరిగే సమావేశంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ సహా పలు కీలక అంశాలకు మంత్రులు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఆయా అంశాల సమాచారాన్ని సాధారణ పరిపాలన విభాగానికి పంపాలని ప్రభుత్వ శాఖల ప్రత్యేక సీఎస్‌లు, పీఎస్‌లకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది.
Similar News
News February 28, 2025
బంగ్లా పుస్తకాల్లో ఇందిర ఫొటోలు తొలగింపు

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తమ నూతన పాఠ్య పుస్తకాల్లో మార్పులు చేసింది. బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటంలో సాయం చేసిన భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఫొటోలను తొలగించింది. బంగ్లా నేత షేక్ ముజిబుర్ రెహమాన్ చిత్రాలనూ తీసివేసింది. కాగా పాక్ నుంచి బంగ్లాకు విముక్తి కల్పించేందుకు అప్పట్లో ఇందిరా విశేష కృషి చేశారు. ఇందుకు కృతజ్ఞతగా అక్కడి పుస్తకాల్లో చరిత్ర పుటల్లో నిలిచిపోయేలా ఇందిరా ఫొటోలను ముద్రించారు.
News February 28, 2025
‘కూలీ’ రూ.వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుంది: సందీప్

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న ‘కూలీ’ సినిమా రూ.1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ అభిప్రాయపడ్డారు. ‘నేను కూలీ సినిమాలో భాగం కాదు. లోకేశ్ నా ఫ్రెండ్ కావడంతో సూపర్ స్టార్‌ను చూసేందుకు కూలీ సెట్స్‌కు వచ్చాను. నేను సినిమాలోని 45 నిమిషాలు చూశాను. ఇది కచ్చితంగా రూ.వెయ్యి కోట్లు వసూలు చేస్తుంది’ అని ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
News February 28, 2025
హరీశ్ రావుపై మరో కేసు నమోదు

TG: బీఆర్ఎస్ నేత హరీశ్ రావుపై హైదరాబాద్‌లో మరో కేసు నమోదైంది. చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరుకు బాచుపల్లి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. హరీశ్ రావుతోపాటు సంతోశ్ కుమార్, పరశురాములు, వంశీ వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ ఆయన పోలీసులను ఆశ్రయించారు. వారు బెదిరింపులకు పాల్పడుతున్నారని, తనకు రక్షణ కల్పించాలని ఆయన వారిని వేడుకున్నారు.