News July 10, 2024

రేపటి నుంచి వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్

image

TG: గ్రూప్-4లో మెరిట్ జాబితాలో చోటు దక్కించుకున్న వినికిడి లోపం ఉన్న అభ్యర్థులకు రేపటి నుంచి సెప్టెంబర్ 4 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుంది. అభ్యర్థులు HYD కోఠిలోని ఈఎన్‌టీ ఆసుపత్రిలో మెడికల్ బోర్డు ఎదుట హాజరై వెరిఫికేషన్ చేయించుకోవాలని TGPSC తెలిపింది. వెరిఫికేషన్ కోసం వెంట తీసుకురావాల్సిన ధ్రువపత్రాలు తదితర వివరాల కోసం <>వెబ్‌సైట్‌<<>>ను సందర్శించాలని సూచించింది.

Similar News

News February 28, 2025

తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్

image

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వాణీ తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాలో వెల్లడించారు. తమ జీవితంలోకి చిన్నారి రాబోతున్నట్లు హింట్ ఇస్తూ ఫొటోను పోస్ట్ చేశారు. నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను ఈ అమ్మడు 2023లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఈ బ్యూటీ భరత్ అనే నేను, వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ సినిమాల్లో నటించారు.

News February 28, 2025

ఆ రేపిస్టుల కన్నా పిశాచాలే మేలేమో!

image

ఈ దుర్యోధన, దుశ్శాసన, దుర్వినీత లోకంలో.. రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో.. మరో మహాభారతం, ఆరవ వేదం, మానభంగ పర్వంలో మాతృ హృదయ నిర్వేదం.. అని వేటూరి రాసింది అక్షరసత్యం. రేపిస్టుల దారుణాలను చూస్తే వారి కన్నా పిశాచాలే మేలేమో అనిపిస్తోంది. పుణేలో బస్సులో యువతిపై అత్యాచారం. గ్వాలియర్లో ఐదేళ్ల <<15601122>>చిన్నారి<<>>పై అఘాయిత్యం. రక్తపు మడుగులో పడున్న ఆమె మర్మాంగాలకు 29 కుట్లు పడ్డాయి. ఏం చేస్తే వీళ్లు మారేను!

News February 28, 2025

విద్యార్థులకు మూడో భాష అక్కర్లేదు: స్టాలిన్

image

Ai కాలంలో విద్యార్థులకు మూడో భాష అక్కర్లేదని తమిళనాడు సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. ‘ట్రాన్స్‌లేషన్ కోసం టెక్నాలజీ రావడంతో భాషకు అడ్డంకులు తొలగిపోయాయి. పిల్లలను అదనపు భాషతో ఇబ్బంది పెట్టొద్దు. వాళ్లు మదర్ టంగ్‌తో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీలో పట్టు కోసం ఇంగ్లిష్ నేర్చుకుంటే చాలు’ అని ట్వీట్ చేశారు. కాగా, NEPలో భాగంగా దేశవ్యాప్తంగా స్థానిక భాషతో పాటు హిందీ, ఇంగ్లిష్ తేవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.

error: Content is protected !!