News July 10, 2024
అమరావతికి కేంద్రం గుడ్‌న్యూస్!

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు(ORR)కు ఇప్పటికే అనుమతి ఇచ్చిన కేంద్రం.. ఈ ఏడాది బడ్జెట్‌లోనే నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. 189 KM ORRకు రూ.25వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేయగా ఈ సారి బడ్జెట్‌లో రూ.5-10వేల కోట్లు కేటాయించే అవకాశముందని సమాచారం. భూసేకరణ సహా అన్ని ఖర్చులను కేంద్రమే భరించనుంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వెళ్లే ఈ ORRను 6 లేన్లతో ఎక్స్‌ప్రెస్ వేగా అభివృద్ధి చేయనున్నారు.
Similar News
News March 30, 2026
జగన్‌కు క్రెడిట్ చోరీ డిజార్డర్ ముదిరిపోయింది: టీడీపీ

AP: మూలపేట <<19518755>>పోర్టును<<>> 70% తానే పూర్తి చేసినట్లు జగన్ చెప్పుకుంటున్నారని టీడీపీ విమర్శించింది. ఆయనకు క్రెడిట్ చోరీ డిజార్డర్ ముదిరిపోయిందని ట్వీట్ చేసింది. ‘నిజానికి అది భావనపాడు పోర్టు. దాని పనులు అంతకుముందు టీడీపీ హయాంలోనే ప్రారంభమయ్యాయి. YCP హయాంలో నిలిచిపోయిన పనులను కూటమి ప్రభుత్వం వేగవంతం చేయగానే జగన్ క్రెడిట్ చోరీ మొదలు పెట్టాడు’ అని మండిపడింది.
News March 30, 2026
BREAKING: వైభవ్ విధ్వంసం

చెన్నైతో మ్యాచ్‌లో RR యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించారు. 15 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశారు. ఇందులో 5 సిక్సులు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. మొత్తంగా 17 బంతుల్లో 52 రన్స్ చేసి ఔటయ్యారు. మొదట బ్యాటింగ్ చేసిన CSK 19.4 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.
News March 30, 2026
భారత భవిష్యత్తును మోదీ తాకట్టుపెట్టారు: రాహుల్

PM మోదీ తనను, తన వ్యక్తిగత ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికే ప్రయత్నిస్తున్నారని LoP రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆయన భారత భవిష్యత్తును తాకట్టు పెట్టారనే విషయం ప్రజలకు తెలుసన్నారు. ‘మోదీ పాలనలో డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనం రూ.100 దిశగా సాగుతోంది. స్టాక్స్, ఎకానమీ, ఇన్‌కమ్, సేవింగ్స్ పడిపోయాయి. ఉద్యోగాలు మాయమయ్యాయి. సిలిండర్లు అందుబాటులో లేవు. వీటన్నిటికీ మోదీ రాజీపడటమే కారణం’ అని ట్వీట్ చేశారు.


