News July 10, 2024
అంతరిక్ష దినోత్సవం: నెల రోజుల పాటు ఇస్రో వేడుకలు
ప్రతి ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహిస్తామని ప్రధాని మోదీ గత ఏడాది ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15 నుంచి పంద్రాగస్టు వరకు ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా అంతరిక్ష ప్రయోగాల గురించి వివరణ, విద్యార్థులకు సెమినార్లు, పోటీల వంటివి నిర్వహించనుంది. వచ్చే నెల 23న ఢిల్లీలో ఈ వేడుకల ముగింపు కార్యక్రమం జరుగుతుంది.
Similar News
News January 18, 2025
భారతీయుల ఆయుర్దాయం ఎంతంటే?
ప్రపంచంలోని వివిధ దేశాలను బట్టి ప్రజల సగటు జీవిత కాలం మారుతుంటుంది. హాంకాంగ్‌లో ఉండే ప్రజలు సగటున ఏకంగా 85 ఏళ్లు జీవిస్తారని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ వెల్లడించింది. అత్యల్పంగా నైజీరియాలో 53 ఏళ్లు మాత్రమే జీవిస్తారని తెలిపింది. ఈ జాబితాలో మకావో(85), జపాన్(84), సౌత్ కొరియా(84), స్విట్జర్లాండ్(84), సింగపూర్(83), నార్వే(83), AUS(83), స్పెయిన్(83), ఇండియా(67), పాకిస్థాన్(66) ఉన్నాయి.
News January 18, 2025
ఆహారాన్ని పదే పదే వేడిచేస్తున్నారా?
అన్నంతో పాటు ఇతర ఆహార పదార్థాలను పదే పదే వేడి చేసి తినడం ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘గదిలో రైస్‌ను ఎక్కువ సేపు ఉంచడం వల్ల బ్యాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది హానికరమైన టాక్సిన్స్ విడుదల చేస్తుంది. దీంతో పోషకాలు కోల్పోవడం, జీర్ణ సమస్యలు & ఫుడ్ పాయిజనింగ్ జరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే రైస్ వండిన గంటలోనే ఫ్రిజ్‌లో ఉంచి తినేముందు వేడి చేయాలి’ అని సూచిస్తున్నారు.
News January 18, 2025
కొలికపూడిపై అధిష్ఠానం సీరియస్.. చర్యలకు సిద్ధం!
AP: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై చర్యలకు టీడీపీ అధిష్ఠానం సిద్ధమైంది. ఇటీవల ఓ ఎస్టీ మహిళపై దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. సీఎం చంద్రబాబు కూడా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం క్రమశిక్షణా కమిటీ ముందు హాజరవ్వాలని కొలికపూడిని ఆదేశించింది. గతంలోనూ ఆయన తీరు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.