News July 10, 2024
రేపు కడపలో జాబ్ మేళా.. అర్హతలివే!

జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో గురువారం ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. హెచ్డీఎఫ్సీ లైఫ్, ఆల్ డిక్సన్, కాంపోజిట్ టెక్నాలజీ, ట్రయోవిజన్ కంపెనీల్లో వివిధ హోదాలలో పనిచేయుటకు టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ చదివిన విద్యార్థులు అర్హులని తెలిపారు. 18 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలని తెలిపారు.
Similar News
News January 14, 2026
కడప: 68,207 హెక్టార్లలో పప్పు శనగ సాగు

కడప జిల్లాలో ప్రస్తుత రబీలో 68,207 హెక్టార్లలో పప్పు శనగ పంటను రైతులు సాగు చేశారు. వాయుగుండం ప్రభావంతో ఇటీవల జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. పూత, పిందె దశలోని శనగ పంటకు నష్టం జరిగిందని రైతుల ఆందోళన చెందుతున్నారు. శనగ మొక్కలో కీలకమైన పులుసు వర్షానికి కరిగిపోయిందని రైతులు వాపోతున్నారు. ప్రొద్దుటూరు ప్రాంతంలో కురిసిన వర్షానికి పులుసు రాలిపోయేంతగా నష్టం లేదని MAO వరహరికుమార్ తెలిపారు.
News January 14, 2026
గండికోటలో సందడి చేసిన హీరో కిరణ్ అబ్బవరం

గండికోట ఉత్సవాలలో సినీనటుడు, రాయచోటి వాసి కిరణ్ అబ్బవరం సందడి చేశారు. యువతతో ఫొటోలు తీసుకుంటూ కలియతిరిగారు. అనంతరం మాట్లాడుతూ.. తనని ఈ ఉత్సవాలకు ఆహ్వానించిన కలెక్టర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 20-25 ఏళ్ల వయసులోని యువత వారి ఆలోచనా విధానం కేవలం సంపాదించాం, ఎంజాయ్ చేశామన్న చిన్నపాటి సంతోషాలకే పరిమితం అవుతున్నారు. కానీ అది కాదు జీవితం. కెరీర్ పరంగా సుస్థిర స్థానం పొందాలిని యువతకు సూచించారు.
News January 13, 2026
సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

సంక్రాంతి పండగను పురస్కరించుకుని ప్రజలు, పోలీస్ సిబ్బందికి ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంటిల్లిపాది సంతోషంగా సంక్రాంతి పండుగను నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల జోలికెళ్లకుండా భోగి, మకర సంక్రాంతి, కనుమను ఆనందంగా జరుపుకోవాలని కోరారు.


