News July 10, 2024
HYD: గ్రూప్-2 అభ్యర్థులు తొందర పడొద్దు: చనగాని

గ్రూప్-2 అభ్యర్థులు తొందర పడొద్దని, CM రేవంత్ సానుకూలంగా ఉన్నారని TPCC అధికార ప్రతినిధి చనగాని దయాకర్ అన్నారు. గ్రూప్-2 అభ్యర్థుల విజ్ఞప్తికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. బీఆర్ఎస్ ఉచ్చులో పడకుండా ప్రిపరేషన్‌కు సిద్ధం కావాలని చనగాని దయాకర్ సూచించారు. DSC పరీక్ష వాయిదా ఉండదని స్పష్టం చేశారు. నిరుద్యోగుల పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి అని, త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని వెల్లడించారు.
Similar News
News July 6, 2025
ఖైరతాబాద్: లైసెన్స్ రెన్యూవల్‌కు దూరం.. దూరం !

గ్రేటర్‌లో ఏ వ్యాపారం నిర్వహించాలన్నా GHMC ట్రేడ్ లైసెన్స్ కచ్చితంగా ఉండి తీరాలి. దీనిని ప్రతి సంవత్సరం డిసెంబర్ 31లోగా రెన్యూవల్ చేయించాలి. అయితే ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలో 10వేల వ్యాపార సంస్థలు ఉంటే 4వేల మంది, జూబ్లిహిల్స్ సర్కిల్‌లో 15వేల మంది వ్యాపారులు ఉంటే 7వేల మంది మాత్రమే తమ ట్రేడ్ లైసెన్సులు పునరుద్ధరించుకున్నారు. ఏడు నెలలు దాటుతున్నా లైసెన్సు రెన్యూవల్ గురించి వ్యాపారులు ఆలోచించడం లేదు.
News July 6, 2025
HYD: గ్రేటర్లో 4 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు

గ్రేటర్ HYD పరిధిలో మొత్తం 4 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్క కేంద్రానికి సుమారు ఎకరా స్థలం అవసరం ఉందని, ప్రస్తుతం స్థలాల ఎంపిక కొనసాగుతుందని, అనువైన స్థలం దొరకని కారణంగా లేట్ అవుతున్నట్లు సంయుక్త రవణ శాఖ కమిషనర్ రమేశ్ తెలిపారు. దీంతో రోడ్డుపై వాహనం ఎక్కాలంటే ఈ ఆటోమేటిక్ స్టేషన్లలో చెకింగ్ చేయాల్సి ఉంటుంది.
News July 6, 2025
GHMC: అసలు మనకెన్ని ఆస్తులున్నాయి..?

GHMCకి అసలు స్థిరాస్తులు ఎన్ని ఉన్నాయో అధికారులకు అంతుపట్టడం లేదు. దీంతో గ్రేటర్ పరిధిలోని ఆస్తులను సర్వే చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆ మేరకు సర్వే చేయడానికి కన్సల్టెంట్లను టెండర్లకు ఆహ్వానించారు. నాలుగు జోన్లలో దాదాపు 1400 స్థిరాస్తులు ఉన్నాయని రికార్డుల్లో ఉంది. ఎక్కడెక్కడ, ఏఏ ఆస్తులు ఉన్నాయో త్వరలో సర్వే చేసి మొత్తం ఆస్తి వివరాలు తెలుసుకోనున్నారు.