News July 10, 2024

సీఎంతో భేటీ కానున్న BPCL ప్రతినిధులు

image

AP: మచిలీపట్నంలో రిఫైనరీ ఏర్పాటుకు బీపీసీఎల్ సుముఖంగా ఉందని ఎంపీ బాలశౌరి తెలిపారు. రాష్ట్రానికి వచ్చిన BPCL ప్రతినిధులు విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. కాసేపట్లో సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. రూ.60వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ రిఫైనరీ కోసం 2-3వేల ఎకరాల భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీని ద్వారా 25 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.

Similar News

News January 19, 2025

డబ్బులిస్తేనే కూల్చివేతలు ఆగుతాయని అధికారుల బెదిరింపులు: ఈటల

image

TG: హైడ్రా పేరుతో 3 నెలలుగా INC ప్రభుత్వం హంగామా చేస్తోందని BJP MP ఈటల రాజేందర్ విమర్శించారు. బాలాజీ నగర్, జవహర్ నగర్‌లో పేదలు భూములు కొని 40 ఏళ్లుగా అక్కడ ఉంటున్నారని తెలిపారు. డబ్బులిస్తేనే కూల్చివేతలు ఆగుతాయని అధికారులు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తన రాజకీయ జీవితంలో ఇంత అసమర్థ, అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదని దుయ్యబట్టారు. ప్రతి పనిలో 7-10 శాతం కమీషన్ ఇవ్వనిదే బిల్లులు సెటిల్ కావట్లేదన్నారు.

News January 19, 2025

ఢిల్లీకి బయల్దేరిన సీఎం.. అక్కడి నుంచి జ్యురిచ్‌కు..

image

AP: సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయల్దేరారు. అక్కడి నుంచి అర్ధరాత్రి ఆయన జ్యురిచ్‌కు వెళ్తారు. సీఎం వెంట మంత్రులు లోకేశ్, టీజీ భరత్, ఇతర అధికారులు వెళ్లనున్నారు. దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో వీరు పాల్గొంటారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ‘బ్రాండ్ ఏపీ ప్రమోషన్’ పేరుతో సీఎం నేతృత్వంలోని బృందం 5 రోజులపాటు దావోస్‌లో పర్యటించనుంది.

News January 19, 2025

ఆర్థిక పరిస్థితి దుర్భరం.. అయినా పథకాల అమలు: మంత్రి జూపల్లి

image

TG: రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. వీటి అమలు లక్ష్యాన్ని నీరుగార్చొద్దని అధికారులకు సూచించారు. లబ్ధిదారుల ఎంపిక జాగ్రత్తగా చేపట్టాలని, తప్పులు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దుర్భరంగా ఉన్నప్పటికీ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.