News July 10, 2024
ఆదిలాబాద్: ఇప్పటి వరకు 94 వేల మందికి లబ్ది

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా మహాలక్ష్మి పథకం కింద రూ.500 వంట గ్యాస్ సిలిండరు ప్రభుత్వం అందజేస్తోంది. జిల్లాలో పథకం కోసం సుమారు 3 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వివరాలు సక్రమంగా ఉండి LPG సిలిండర్లు ఉన్నవారికి ఇప్పటి వరకు జిల్లాలో 94వేల మంది లబ్ది పొందారని జిల్లా పౌరస రఫరాలశాఖ అధికారులు చెబుతున్నారు. సబ్సిడీని డీబీటీ విధానంలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు.
Similar News
News January 23, 2026
ఉట్నూర్: పాలిటెక్నిక్ లేటరల్ ఎంట్రీకి దరఖాస్తు ఆహ్వానం

ఐటీఐ పూర్తి చేసి పాలిటెక్నిక్ కళాశాలలో లెటరల్ ఏంట్రీ ద్వారా నేరుగా ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పించడానికి ప్రకటన విడుదలైనట్లు ఉట్నూర్ ప్రభుత్వ గిరిజన ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఐటీఐలో 60% మార్కులతో రెండేళ్ల కోర్సు తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలన్నారు. తమ సమీపంలోని ఐటీఐ కళాశాలలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అర్హులైన యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News January 23, 2026
ఆదిలాబాద్: ఉచిత శిక్షణ కోసం దరఖాస్తుల స్వీకరణ

మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్, టైలరింగ్ కోర్స్‌లకు ఉచిత శిక్షణ కోసం మైనార్టీల నుంచి (ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైనులు, బౌద్ధులు, పార్శీ) దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ADB DMWO కలీం తెలిపారు. జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్‌కు ఇంటర్ , డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు, టైలరింగ్ కోసం పదో తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఈనెల 28లోపు దరఖాస్తులను ఇవ్వాలన్నారు.
News January 23, 2026
ఓటు రాజ్యాంగం కల్పించిన గొప్ప వరం: ఆదిలాబాద్ కలెక్టర్

ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని, అది భారత రాజ్యాంగం మనకు కల్పించిన గొప్ప హక్కని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం వంటిదని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావడంతోపాటు, ఎన్నికల సమయంలో తమ హక్కును వినియోగించుకోవాలని సూచించారు.


