News July 10, 2024

లోన్ యాప్స్ జోలికి వెళ్లకండి: పోలీసులు

image

TG: లోన్ యాప్స్ వేధింపులతో ఓ వ్యక్తి కిడ్నీ అమ్మేందుకు యత్నించిన ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రజలు వాటి జోలికి వెళ్లొద్దని అవగాహన కల్పిస్తున్నారు. ‘లోన్ యాప్స్ ద్వారా అప్పు చేసి అవసరాలు తీర్చుకోవటం తాత్కాలికంగా మనల్ని సమస్య నుంచి బయటపడేస్తుంది. కానీ ఆ తర్వాత మన పాలిట శాపంగా పరిణమిస్తుంది. లోన్ యాప్ అప్పులు మన జీవితాల్ని అంధకారంలోకి నెడతాయి. తస్మాత్ జాగ్రత్త!’ అని Xలో పోస్ట్ చేశారు.

Similar News

News October 15, 2024

భారత్‌‌కు టెస్టు క్రికెట్ ఆడాలనుకుంటున్నా: సంజూ

image

టీమ్ ఇండియా తరఫున టెస్టు క్రికెట్ ఆడాలనుకుంటున్నట్లు భారత ప్లేయర్ సంజూ శాంసన్ తెలిపారు. రెడ్ బాల్ క్రికెట్‌లో సక్సెస్ అవుతానన్న నమ్మకం ఉందని చెప్పారు. దులీప్ ట్రోఫీకి ముందు టెస్టుల కోసం తనను పరిగణనలోకి తీసుకుంటామని, రంజీపై ఫోకస్ చేయమని హైకమాండ్ చెప్పినట్లు గుర్తు చేశారు. ఈ సారి ప్రిపరేషన్ మెరుగ్గానే ఉందని పేర్కొన్నారు. కాగా బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి టీ20లో సంజూ సెంచరీ బాదిన సంగతి తెలిసిందే.

News October 15, 2024

భారీ వర్షాలు.. హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు

image

AP: రాయలసీమ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. తిరుపతి-0877-2236007, గూడూరు-8624252807, సూళ్లూరుపేట-8623295345, తిరుపతి RDO-7032157040, శ్రీకాళహస్తి-9966524952 నంబర్లను అందుబాటులో ఉంచారు. అటు పలు జిల్లాల్లో పునరావాస కేంద్రాలను ముందు జాగ్రత్తగా ఏర్పాటు చేస్తున్నారు.

News October 15, 2024

రతన్ టాటా కుక్క బెంగతో చనిపోయిందా..? నిజమిదే!

image

స్వర్గీయ రతన్ టాటాపై బెంగతో ఆయన పెంపుడు శునకం ‘గోవా’ చనిపోయిందంటూ వాట్సాప్‌లో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఆ వార్తల్ని ముంబైలో ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న సుధీర్ కుడాల్కర్ ఖండించారు. ‘రతన్‌కి సన్నిహితుడైన శంతను నాయుడిని అడిగి తెలుసుకున్నాను. గోవా ఆరోగ్యంగా ఉంది. దయచేసి ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయకండి’ అని విజ్ఞప్తి చేశారు. కాగా.. లైకుల కోసం ఇంత దిగజారాలా అంటూ ఆ వీడియో క్రియేటర్లపై పలువురు మండిపడుతున్నారు.