News July 10, 2024

ప్రతి ఎకరాకు నీరిచ్చేందుకు ప్రయత్నిస్తాం: మంత్రి కొల్లు

image

AP: వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పులిచింతల ఎండిపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర దుయ్యబట్టారు. 40 టీఎంసీలు ఉండాల్సిన చోట అర టీఎంసీ కూడా నీటి నిల్వ లేదన్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఎడమ కాల్వలకు ఆయన నీటిని విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరిచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు. కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా నీటిని విడుదల చేస్తామన్నారు.

Similar News

News January 19, 2025

కరుణ్‌కు నో ఛాన్స్.. భజ్జీ విస్మయం

image

కరుణ్ నాయర్‌ను CTకి ఎంపిక చేయకపోవడంపై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ విస్మయం వ్యక్తం చేశారు. ఫామ్, పర్ఫార్మెన్స్ ఆధారంగా మీ ఎంపిక లేనప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడటంలో అర్థమేముంది? అని ట్వీట్ చేశారు. దీంతో రాణించే ప్లేయర్లను కాకుండా ఫెయిల్యూర్ బ్యాటర్లనే జట్టులోకి తీసుకుంటారని కొందరు భజ్జీకి మద్దతుగా కామెంట్ చేస్తున్నారు. ఎవరి ప్లేస్‌లో కరుణ్‌ను తీసుకోవాలో చెప్పాలని మరికొందరు ఎదురు ప్రశ్నిస్తున్నారు.

News January 19, 2025

పవన్, లోకేశ్‌తో బండి సంజయ్ చిట్‌చాట్

image

AP: కేంద్రమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన సందర్భంగా మరో మంత్రి బండి సంజయ్ కూడా ఆయన వెంట వచ్చారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్ద పవన్ కళ్యాణ్, నారా లోకేశ్‌తో సంజయ్ కాసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించి ఫొటోలను ఆయన తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

News January 19, 2025

వైసీపీలో నియామకాలు.. చోడవరానికి అమర్నాథ్, భీమిలికి శ్రీను

image

AP: పలు నియోజకవర్గాలకు వైసీపీ నూతన సమన్వయకర్తలను నియమించింది. చోడవరానికి గుడివాడ అమర్నాథ్, మాడుగులకు బూడి ముత్యాలనాయుడు, భీమిలికి మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను), గాజువాకకు తిప్పల దేవన్ రెడ్డి, పి.గన్నవరానికి గన్నవరపు శ్రీనివాసరావును నియమించింది. అలాగే అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులుగా కరణం ధర్మశ్రీని, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వరికూటి అశోక్‌బాబుకు బాధ్యతలు అప్పగించింది.