News July 10, 2024
టీటీడీ ఛైర్మన్ పదవి రేసులో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి?

టీటీడీ నూతన ఛైర్మన్ ఎవరన్నది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ పదవి కోసం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కూడా రేసులో ఉన్నట్లు సమాచారం. జిల్లాలో పార్టీ గెలుపు కోసం చాలా కష్టపడ్డామని తమకు ఛైర్మన్ పదవి ఇవ్వాలని ఆమె కోరుతున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. గతంలో టీటీడీ ఢిల్లీ అడ్వైజరీ బోర్డు ఛైర్‌పర్సన్‌గా, పాలక మండలిలో సభ్యురాలిగా పని చేసిన అనుభవం ఉండటంతో ఆ పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News January 20, 2026
నెల్లూరు జిల్లాలో సరికొత్తగా అంగన్వాడీలు

నెల్లూరు జిల్లాలో 2,942 అంగన్వాడీ కేంద్రాలకు 1,037 సొంత భవనాల్లో మిగిలినవి అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. 401 కేంద్రాలను సక్ష అంగన్వాడీలకు కేంద్రం అభివృద్ధి చేస్తోంది. రూ.1.83కోట్లు ఖర్చు చేసి అంగన్వాడీల్లో కూరగాయలు పండించడం, ఇంకుడు గుంతలు నిర్మించడం, టీవీ, బొమ్మలు, ఇతరత్రా మౌలిక వసతులు కల్పిస్తోంది. మరో 205 కేంద్రాల అభివృద్ధికి గతేడాది ప్రతిపాదనలు పంపారు. వీటిని సైతం త్వరలో అభివృద్ధి చేస్తారు.
News January 20, 2026
ఆ పాపాలే మీకు శాపాలు: కాకాణి

కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆత్మకూరులో ఆయన మాట్లాడుతూ. కూటమి పాలనలో అవినీతి తప్ప అభివృద్ధి లేదని చెప్పారు. జగనన్న తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను తుంగలో తొక్కారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్న పాపాలు వారికి భవిష్యత్తులో శాపాలుగా మారుతాయని చెప్పారు. ఎంపీ గురుమూర్తి, విక్రమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News January 20, 2026
నెల్లూరులో దొంగ నాగ సాధువులు హల్‌చల్

నాగ సాధువుల ముసుగులో ఓ ఇద్దరు వ్యక్తులు నెల్లూరులో హల్‌చల్ చేశారు. ఓ ఇంటికి వెళ్లి అన్నం పెట్టమని అడిగారు. వారు లేదని చెప్పడంతో వారితో అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో స్థానికులు వారిపై దాడికి ప్రయత్నించారు. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు నాగసాధువు ముసుగులో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. బూతులు మాట్లాడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు.


