News July 10, 2024
హార్బర్ల టెండర్లలో YCP గోల్‌మాల్: అచ్చెన్న

AP: వైసీపీ హయాంలో 5 హార్బర్ల టెండర్లను సొంతవారికే కట్టబెట్టారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. టీడీపీ సానుభూతిపరులకు మత్స్యకార భృతి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ‘మత్స్యకార భృతిపై 20 రోజుల్లో నివేదిక తయారు చేస్తాం. మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ రూ.10 కోట్ల బకాయి ఉంది. వాటిని త్వరలోనే చెల్లిస్తాం. ప్రస్తుతం మత్స్యశాఖ పరిస్థితి చూస్తుంటే బాధేస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News November 9, 2025
ప్రభుత్వాన్ని మార్చడం వల్ల ఇబ్బందులొస్తాయి: లోకేశ్

బిహార్ అభివృద్ధి కోసం NDAను మరోసారి గెలిపించాలని మంత్రి లోకేశ్ ఓటర్లను కోరారు. పట్నాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని మార్చడం వల్ల ఇబ్బందులొస్తాయని, అభివృద్ధి ఆగిపోతుందని చెప్పారు. గతంలో APలో ఒక్క ఛాన్స్ పేరుతో ఓ పార్టీ అధికారంలోకి రాగానే పరిశ్రమలన్నీ పారిపోయాయని తెలిపారు. ఏపీలో జరిగిన దాన్ని దృష్టిలో ఉంచుకుని బిహార్ యువత మేల్కోవాలని పిలుపునిచ్చారు.
News November 9, 2025
కేటీఆర్ ప్రచారం శ్రీలీల ఐటమ్ సాంగ్‌ను గుర్తు తెస్తోంది: రేవంత్

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి చెరిపేస్తే చెరిగిపోయేది కాదని CM రేవంత్ అన్నారు. కానీ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘ప్రేక్షకులను ఉత్తేజపరచడానికి సినిమా మధ్యలో ఐటమ్ సాంగ్స్ వస్తుంటాయి. వాటిని కేటీఆర్ ఆదర్శంగా తీసుకొని మాపై విమర్శలు చేస్తున్నారు. ఆయన తీరు చూస్తుంటే పుష్ప సినిమాలో శ్రీలీల ఐటమ్ సాంగ్ గుర్తొస్తోంది’ అని సెటైర్ వేశారు.
News November 9, 2025
మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ల అరెస్టు

ఇద్దరు భారత మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు విదేశాల్లో అరెస్టయ్యారు. భాను రాణా(లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్)ను అమెరికాలో, వెంకటేశ్ గార్గ్(నందు గ్యాంగ్)ను జార్జియాలో అదుపులోకి తీసుకున్నారు. సెక్యూరిటీ ఏజెన్సీలు, హరియాణా పోలీస్ శాఖ కలిసి వారిని పట్టుకున్నాయి. భాను, వెంకటేశ్‌ను ఇక్కడికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీరిపై హరియాణా, పంజాబ్, ఢిల్లీలో పదుల సంఖ్యలో క్రిమినల్ కేసులున్నాయి.


