News July 10, 2024
14 ఉత్పత్తుల సేల్స్ ఆపేసిన పతంజలి

తమ సంస్థకు చెందిన 14 ఉత్పత్తుల సేల్స్ నిలిపివేసినట్లు పతంజలి సుప్రీంకోర్టుకు వెల్లడించింది. వీటికి సంబంధించిన యాడ్స్‌ను తొలగించాలని మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు సమాచారం అందించినట్లు తెలిపింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం వీటి లైసెన్స్‌లు క్యాన్సిల్ చేసిన నేపథ్యంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. శ్వాసరీ గోల్డ్, లిపిడోమ్, మధుగ్రిట్, బీపీగ్రిట్, లివామ్రిత్ అడ్వాన్స్, లివోగ్రిట్ మొదలైన ఉత్పత్తులు ఈ జాబితాలో ఉన్నాయి.
Similar News
News January 17, 2026
APSRTCకి మరో ప్రతిష్ఠాత్మక అవార్డు

AP: APSRTCకి గవర్నెన్స్ నౌ 6వ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అవార్డు దక్కింది. గతేడాది బస్ స్టేషన్లలో రాకపోకలను ముందస్తుగా ప్రకటించి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం కల్పించడంతో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందించారు. ఈ అవార్డును RTC చీఫ్ ఇంజినీర్ Y.శ్రీనివాస రావు స్వీకరించారు. గతంలోనూ RTCకి పలు కేంద్ర ప్రభుత్వ అవార్డులతో పాటు స్కోచ్ పురస్కారాలు లభించిన విషయం తెలిసిందే.
News January 17, 2026
ఒకే విడతలో మున్సిపల్ ఎన్నికలు!

TG: మున్సిపల్ ఎన్నికలు ఒకే విడతలో జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై మున్సిపల్, పోలీస్ శాఖల నుంచి SEC అభిప్రాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇవాళ బల్దియా, వార్డులు ఏయే వర్గాలకు రిజర్వ్ అయ్యాయో తుది ప్రకటన వెలువడనుంది. అటు ఎన్నికల్లో పాల్గొననున్న ఇండిపెండెంట్ల కోసం నిన్న 75 గుర్తులను ఎన్నికల కమిషన్ రిలీజ్ చేసింది. కాగా ఇటీవల సర్పంచ్ ఎన్నికలను 3 విడతల్లో నిర్వహించిన విషయం తెలిసిందే.
News January 17, 2026
మహిళలు నేడు ‘సావిత్రి గౌరీ వ్రతం’ ఆచరిస్తే..?

ముక్కనుమ సందర్భంగా నూతన వధువులు నేడు ‘సావిత్రి గౌరీ వ్రతం’ ఆచరిస్తే దీర్ఘ సుమంగళీ ప్రాప్తం సిద్ధిస్తుందని పండితులు సూచిస్తున్నారు. ‘ఈ వ్రతం చేసిన వివాహితలకు సౌభాగ్యం కలకాలం నిలుస్తుంది. పెళ్లికాని అమ్మాయిలు ఈ పూజలో పాల్గొంటే సద్గుణాల భర్త లభిస్తాడు. ఈ వ్రతం కుటుంబంలో సుఖశాంతులను, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది’ అని చెబుతున్నారు. ఈ వ్రతం ఎలా, ఎప్పుడు చేయాలో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.


