News July 10, 2024
ఎట్టకేలకు శుభ్‌మన్ గిల్ ఫిఫ్టీ

టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఎట్టకేలకు తిరిగి ఫామ్ అందుకున్నారు. జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో గిల్ (66) అర్ధ సెంచరీతో రాణించారు. కాగా గత 10 మ్యాచుల్లో గిల్ ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేశారు. దీంతో ఆయన ఫామ్‌పై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే ఆయనకు చివరి అవకాశం అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు.
Similar News
News January 14, 2026
రాజధాని పనులు వేగంగా చేయాలి: కలెక్టర్

రాజధాని ప్రాంత అభివృద్ధి పనులు వేగవంతం కావాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లో రాజధాని ప్రాంత అభివృద్ధి పనుల పై కలెక్టర్ సమీక్షించారు. అభివృద్ధి పనులకు అవసరమైన గ్రావెల్, కంకర, రహదారి మెటీరియల్ తదితర అంశాల్లోఎటువంటి జాప్యం లేకుండా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. జేసీ అశుతోష్ శ్రీవాస్తవ తదితరులు పాల్గొన్నారు.
News January 14, 2026
కేపీఐ డేటా ఎంట్రీలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్

కేపీఐ డేటా ఎంట్రీలో నిర్లక్ష్యం తగదని కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం బాపట్ల కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతి సూచికకు సంబంధించిన సమాచారాన్ని గడువు లోపే ఆన్‌లైన్ డ్యాష్‌బోర్డ్‌లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. టైమ్‌లైన్ పాటించని విభాగాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, డేటా సక్రమతను తప్పనిసరిగా వెరిఫై చేయాలన్నారు.
News January 14, 2026
నేటి ముఖ్యాంశాలు

❃ తెలుగు ప్రజలకు ఇరు రాష్ట్రాల సీఎంల పండగ విషెస్
❃ AP:అదనపు ఛార్జీలు వసూలు చేస్తే బస్సులు సీజ్: మండిపల్లి
❃ వైద్య శాఖకు ₹567 కోట్ల కేంద్ర నిధులు: సత్యకుమార్
❃ TG: గ్రామపంచాయతీలకు రూ.277 కోట్లు విడుదల
❃ అటెన్షన్ డైవర్షన్ కోసమే కమిషన్‌లు, సిట్‌ల ఏర్పాటు: KTR
❃ ఓల్డ్ సిటీలో కరెంట్ బిల్లులు చెల్లించట్లేదు: ఎంపీ కొండా
❃ కవిత కాంగ్రెస్‌లో చేరడం లేదు: పీసీసీ చీఫ్
❃ కుక్క కాటు మరణాలకు భారీ పరిహారం: SC


