News July 10, 2024

BPCLకు అవసరమైన స్థలం కేటాయిస్తాం: CM

image

APలో పెట్రోల్ రిఫైనరీ ఏర్పాటుపై BPCL ఛైర్మన్ కృష్ణకుమార్‌, ప్రతినిధులతో CM చంద్రబాబు భేటీ ముగిసింది. రాష్ట్రంలో గణనీయమైన పెట్రోకెమికల్ వనరులున్నాయని ఈ సందర్భంగా CM అన్నారు. రూ.60-70వేల కోట్లతో ఏర్పాటు చేయనున్న కంపెనీకి 5వేల ఎకరాలు అవసరమని సంస్థ ప్రతినిధులు ఆయన దృష్టికి తెచ్చారు. 90 రోజుల్లో ప్రాజెక్టుపై పూర్తి నివేదిక రూపొందించాలని, ఇబ్బందులు లేకుండా అవసరమైన స్థలం కేటాయిస్తామని CM హామీ ఇచ్చారు.

Similar News

News January 20, 2026

ఈ మాసంలో ‘ప్రతిరోజు పర్వదినమే’

image

ఆధ్యాత్మికపరంగా మాఘమాసం ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో ప్రతిరోజును పర్వదినంగానే భావిస్తారు. సూర్యుడు, విష్ణుమూర్తిని ఆరాధిస్తే పాపాలు తొలగి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు. వసంత పంచమి, రథసప్తమి, మహా శివరాత్రి పండుగలు ఈ మాసంలోనే వస్తాయి. అక్షరాభ్యాసం, వివాహం వంటి శుభకార్యాలకు మాఘ మాసం ఎంతో అనువైనది. పెళ్లిళ్లు ఎక్కువగా మాఘ మాసంలోనే ఎందుకు జరుపుతారో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.

News January 20, 2026

ఈ ఫేస్ ప్యాక్‌తో ఎన్నో లాభాలు

image

పెరుగు, శనగపిండి, పసుపు మూడు కలిసి తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నాయి. వీటిని కలిపి ప్యాక్‌లా తయారుచేసుకుని ముఖానికి, చర్మానికి పట్టించడం వల్ల సౌందర్యం పెరుగుతుంది. చర్మంపై చేరే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. చర్మంపై ముడతలు, మచ్చలు రాకుండా ఉంటాయి. కెమికల్ క్రీములు వాడే బదులు వీటిని వాడటం వల్ల చర్మ సౌందర్యాన్ని సులువుగా పెంచుకోవచ్చని చెబుతున్నారు.

News January 20, 2026

వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి దరఖాస్తు ఎలా?

image

రైతులు ఈ పథకం కోసం స్థానిక వ్యవసాయ విస్తరణాధికారి (AEO) లేదా వ్యవసాయాధికారిని సంప్రదించి దరఖాస్తు తీసుకొని, తమకు కావలసిన యంత్రం వివరాలను నింపి ఇవ్వాలి. దానిని వారు ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేస్తారు. MRO, MPDO, AOలతో కూడిన ‘మండల స్థాయి కమిటీ’ అర్జీలను పరిశీలించి జిల్లా అధికారులకు పంపుతుంది. వారి ఆమోదం తర్వాత, యంత్రాలిచ్చే కంపెనీ పేరిట రైతులు తమ వాటా సొమ్మును డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.