News July 10, 2024
శ్రీకాకుళం: పీజీ పరీక్షల టైం టేబుల్ విడుదల

ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో ఎంఏ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. జూలై 25 నుంచి ఆగస్టు 5 మధ్య జరగనున్న ఈ పరీక్షలను ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకూ యూనివర్సిటీ పరీక్షల విభాగం ఆయా కేంద్రాలలో నిర్వహించనుంది. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://exams.andhrauniversity.edu.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.
Similar News
News November 10, 2025
శ్రీకాకుళం: ఎస్పీ గ్రీవెన్స్‌లో 53 అర్జీల స్వీకరణ

శ్రీకాకుళం ఎస్పీ కార్యలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్‌లో 53 ఫిర్యాదులు వచ్చాయి. వీటి పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ K.V.మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. తన దృష్టికి వచ్చిన అర్జీలపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకున్నామని చెప్పారు. ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.
News November 10, 2025
శ్రీకాకుళం: హోంగార్డుకు ఆర్థిక చేయూత

ఇటీవల రిటైర్ అయిన హోంగార్డు తిరుపతి రావుకు సహచర హోంగార్డులు ఒక్కరోజు గౌరవ వేతనం రూ. 4.11 లక్షలు ఇచ్చారు. ఈ మేరకు సోమవారం శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి చేతుల మీదగా నగదు చెక్కును ఆయనకు అందజేశారు. సహచర పోలీసు సిబ్బంది చూపిన ఈ సహకారం ప్రశంసనీయమని ఎస్పీ అన్నారు. పోలీసు కుటుంబం ఎప్పుడూ ఐకమత్యంగా ఉండాలని ఎస్పీ కోరారు.
News November 10, 2025
బూర్జ: ‘గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పట్ల కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ మార్క్‌ఫెడ్ డైరెక్టర్ ఆనెపు రామకృష్ణ నాయుడు అన్నారు. ఆదివారం బూర్జ మండలం పెద్దపేట పంచాయతీ కొత్త ఊరు గ్రామంలో రూ.13.40 లక్షలతో నిర్మించనున్న మంచినీటి ట్యాంక్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ ట్యాంక్ ద్వారా గ్రామ ప్రజలకు తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కానుందని అన్నారు.


