News July 10, 2024

హత్య కేసులో నిందితులను అరెస్టు చేస్తాం: ఎస్పీ గౌతమిశాలి

image

రాయదుర్గం మండలం మెచ్చిరి గ్రామానికి చెందిన ఆదికేశవులు హత్యకేసులో నిందితులను త్వరగా అరెస్టు చేయాలని ఎస్పీ గౌతమిశాలి ఆదేశించారు. ఎవరినీ వదలకుండా దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. నిందితులకు శిక్షలు పడేలా తగిన ఆధారాలు సేకరించాలని సూచించారు. ఈ తరహా ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా పటిష్ఠ నిఘా వేయాలన్నారు. మెచ్చిరి నుండి కర్నాటకలోని నాగసముద్రానికి వెళ్లే రహదారిపై ఘటనా స్థలాన్ని ఆమె పరిశీలించారు.

Similar News

News November 10, 2025

దళిత ఉద్యమ కెరటం కత్తి పద్మారావు

image

సాహిత్యం, దళిత ఉద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి కత్తి పద్మారావు అని BR అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతి చక్రపాణి, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చంద్రశేఖరరెడ్డి అన్నారు. విమలా స్మారక సాహిత్య జీవిత సాఫల్య పురస్కారం-2025 గుంటూరు(D) పొన్నూరుకు చెందిన పద్మారావుకు ప్రకటించారు. నిన్న అనంతలో జరిగిన సభకు పద్మారావు హాజరు కాలేకపోయారు. పురస్కారాన్ని ఆయన కుమారుడు చేతన్ అందుకున్నారు.

News November 10, 2025

జాతీయస్థాయి పోటీలకు గుంతకల్లు విద్యార్థిని ఎంపిక

image

శ్రీకాకుళంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్-19 మహిళా క్రికెట్ పోటీల్లో అనంతపురం జట్టు విజేతగా నిలిచింది. దీంతో జాతీయస్థాయి పోటీలకు జిల్లా నుంచి ఐదుగురు మహిళా క్రీడాకారులు ఎంపికయ్యారు. గుంతకల్లు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థిని, వికెట్ కీపర్ బట్నపాడు అమూల్య జాతీయస్థాయి జట్టుకు ఎంపికైంది. ప్రిన్సిపల్ సాలాబాయి, కాలేజీ సిబ్బంది, పలువురు క్రీడాకారులు ఆమెను అభినందించారు.

News November 9, 2025

అనంతలో ముగిసిన రెవిన్యూ క్రీడలు

image

అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో రెండు రోజులుగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలు ఆదివారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, సవిత, అనంతపురం MP అంబికా లక్ష్మీ నారాయణ, పలువురు MLAలు హాజరయ్యారు. అసోసియేషన్ నాయకులను అభినందించి, గెలుపొందిన వారికి మెమెంటోలు అందించారు.