News July 10, 2024

నిజామాబాద్‌లో పేకాటాడుతున్న ఐదుగురు అరెస్ట్

image

నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ కాలనీలో పేకాటాడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ విష్ణుమూర్తి తెలిపారు. వారికి అందిన సమాచారం మేకు దాడులు నిర్వహించి పేకాటాడుతున్న వారి వద్ద 5 సెల్‌ఫోన్లు, 11,520 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ వెల్లడించారు. అనంతరం వారిని రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆయనతో పాటు సీఐ పురుషోత్తం, సిబ్బంది ఉన్నారు.

Similar News

News February 8, 2025

NZB: వాహనాలు నడుపుతున్నారా..? నిబంధనలు పాటించాల్సిందే!

image

వాహనదారులకు నిజామాబాద్, కామారెడ్డి పోలీసులు పలు సూచనలు చేశారు. ఇటీవల పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.
> పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దు.
> వాహన ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ వెంట ఉండాల్సిందే.
> బైకర్లు ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు.
> హెల్మెట్ లేకుండా బైక్ నడపొద్దు.
> అతివేగంగా వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు..
> నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు SHARE IT

News February 8, 2025

కామారెడ్డి పెద్ద చెరువులో యువకుడి గల్లంతు

image

కామారెడ్డి పెద్ద చెరువులో ఓ యువకుడు గల్లంతయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. జిల్లా కేంద్రంలోని ఆర్బీ నగర్ కాలనీకి చెందిన చిన్నచెవ్వ రాములు, అతడి చిన్నకొడుకు సాయికుమార్ (24)తో కలిసి శుక్రవారం సాయంత్రం పెద్ద చెరువుకు వెళ్లారు. స్నానం చేసేందుకు సాయికుమార్ చెరువులోకి దిగగా, లోతు ఎక్కువగా ఉండడంతో ఈత రాక మునిగిపోయాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దేవునిపల్లి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

News February 8, 2025

NZB: వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే: జీవన్ రెడ్డి

image

వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని వడ్డీతో సహా చెల్లిస్తామని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అనుబంధ సంస్థగా పోలీసు శాఖ పని చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి జాతకాలు పింక్ బుక్‌లో ఎక్కిస్తున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను, నాయకులను అధికారులు, పోలీసులు వేధిస్తున్నారన్నారు.

error: Content is protected !!