News July 11, 2024
బందరు పోర్టు పురోగతిపై నివేదికలు ఇవ్వండి: కలెక్టర్

బందరు పోర్టు నిర్మాణ పనుల పురోగతిపై ప్రతివారం ప్రగతి నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. పోర్టు, జలజీవన్ మిషన్ కింద జరుగుతున్న పనులపై బుధవారం ఆయన సంబంధిత శాఖాధికారులతో సమీక్షించారు. పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. రోడ్ కం రైల్ కనెక్టివిటీకి సంబంధించి భూసేకరణపై దృష్టిసారించాలన్నారు.
Similar News
News March 2, 2026
కృష్ణా: మందుగుండు దుకాణాలపై పోలీసుల సోదాలు

కాకినాడలోని వేట్లపాలెంలో ఇటీవల సంభవించిన పేలుడు ఘటన నేపథ్యంలో కృష్ణాజిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో ఉన్న మందుగుండు సామగ్రి స్థావరాలు, పటాకుల దుకాణాలలో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తూ స్టాక్ వివరాలను సేకరిస్తున్నారు. నివాస ప్రాంతాల మధ్యలో అక్రమంగా మందుగుండు సామగ్రి నిల్వ ఉంచినట్లు సమాచారం అందిన చోట్ల ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు.
News March 1, 2026
రేపు కలెక్టరేట్‌లో ‘మీ కోసం’: కలెక్టర్

ఈనెల 2న సోమవారం కృష్ణా జిల్లా కలెక్టరేట్ సమావేశ హాల్‌లో ఉదయం 10:30 గంటల నుంచి ‘మీ-కోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా వచ్చి వినతులు సమర్పించాలన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News March 1, 2026
అడ్డంకులు అధిగమించి పరిశ్రమలు నెలకొల్పాలి: కలెక్టర్

జిల్లాలో మంజూరైన పరిశ్రమల యూనిట్లను సత్వరమే నెలకొల్పేందుకు ఎదురవుతున్న అడ్డంకులను వెంటనే తొలగించేందుకు చొరవ చూపాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో పరిశ్రమల అధికారులు, ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించి మంజూరైన 230 పరిశ్రమల యూనిట్ల పురోగతిపై యూనిట్ల వారీగా సమీక్షించారు.


