News July 11, 2024
భారతీయుల్ని చేర్చుకోవాలని మేం అనుకోలేదు: రష్యా
కేవలం వాణిజ్యపరమైన కారణాల వల్లే తప్ప భారతీయుల్ని తమ సైన్యంలోకి చేర్చుకోవాలని అసలు అనుకోలేదని రష్యా ఛార్జ్ డి అఫైర్స్ రోమన్ బాబుష్కిన్ తెలిపారు. ‘మేం భారతీయుల కోసం ఎప్పుడూ ప్రకటించలేదు. ఇంత పెద్ద యుద్ధంలో వారి సంఖ్య మహా అయితే 100 ఉంటుంది. అత్యధికులు చట్టవిరుద్ధంగా రష్యాలోకి వచ్చినవారే’ అని పేర్కొన్నారు. కాగా.. ఉక్రెయిన్‌తో యుద్ధంలో కనీసం నలుగురు భారతీయులు కన్నుమూసినట్లు అంచనా.
Similar News
News January 19, 2025
అత్యధిక వికెట్లు.. కానీ CTలో నో ఛాన్స్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో మహమ్మద్ సిరాజ్ లేకపోవడంపై కొందరు క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2022 నుంచి వన్డేల్లో ఎక్కువ వికెట్లు (71) తీసిన భారత బౌలర్ అతడేనని గుర్తు చేస్తున్నారు. అయితే సిరాజ్‌కు న్యూ బాల్‌తో బౌలింగ్ వేసే ఛాన్స్ రాకపోతే అంత ప్రభావవంతంగా కనిపించడని కెప్టెన్ రోహిత్ శర్మ నిన్న చెప్పారు. అర్ష్‌దీప్ సింగ్ కొత్త, పాత బంతితో బౌలింగ్ వేయగలడని తెలిపారు. దీనిపై మీ కామెంట్?
News January 19, 2025
మహిళల ఖాతాల్లోకి రూ.12వేలు
TG: ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ కింద ఏడాదికి రూ.12వేల ఆర్థిక చేయూత నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం లేదని చెప్పారు. ఉపాధి హామీ కూలీల ఆధార్ నంబర్లను సరిగ్గా నమోదు చేయలేదని, డేటా ఎంట్రీలో జరిగిన పొరపాట్లను సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ నెల 26న తొలి విడతగా అకౌంట్లలో రూ.6వేలు జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
News January 19, 2025
ముగిసిన వానాకాలం ధాన్యం కొనుగోళ్లు
TG: వర్షాకాలం వరిధాన్యం సేకరణ ముగిసినట్లు సివిల్ సప్లయ్ అధికారులు తెలిపారు. ఈ సీజన్లో 53.32 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు వెల్లడించారు. వీటిలో సన్న వడ్లు 23.73 లక్షల టన్నులు ఉన్నాయని పేర్కొన్నారు. రైతుల ఖాతాల్లో మొత్తం రూ.12,022 కోట్లను జమ చేశామని తెలిపారు. ప్రభుత్వం ఈ సారి సన్నవడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ అందజేసిన సంగతి తెలిసిందే.