News July 11, 2024
శుభ్‌మన్ గిల్‌పై విమర్శలు

జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో సెంచరీ బాదిన ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో 3వ స్థానంలో వచ్చి 10 రన్స్‌కే ఔటైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెంచరీ చేసిన ఆటగాడి స్థానం మార్చడమేంటంటూ గిల్‌పై విమర్శలు వస్తున్నాయి. వన్‌డౌన్ తాను వెళ్లకుండా అభిషేక్‌ను డిమోట్ చేశారంటూ మండిపడుతున్నారు. అభిషేక్ స్పిన్ హిట్టర్ కాబట్టే వన్ డౌన్‌లో పంపించారంటూ గిల్ ఫ్యాన్స్ మద్దతుగా నిలుస్తున్నారు.
Similar News
News April 8, 2026
వికారాబాద్: ఈ అమ్మాయి GREAT..!

తండ్రి మరణించినా ఆ బాలిక గుండె నిబ్బరం కోల్పోలేదు. తండ్రి భౌతికకాయం ఇంట్లోనే ఉండగా, ఆయన కన్న కలలను నెరవేర్చేందుకు కన్నీళ్లను దిగమింగుకొని పదో తరగతి పరీక్షకు హాజరైంది. ధరూర్‌లోని బోజ్య నాయక్ తండావాసి రవి నాయక్ మంగళవారం మృతిచెందగా, ఆయన కుమార్తె శశికళ కేరెల్లిలో బయాలజీ పరీక్ష రాసింది. పరీక్ష ముగిసిన వెంటనే ఇంటికి చేరుకొని తండ్రి చివరిచూపుకు నోచుకొని అంత్యక్రియల్లో పాల్గొంది.
News April 8, 2026
ఒంటికన్ను రాక్షసుడితో మెగాస్టార్ ఫైట్!

చిరంజీవి హీరోగా నటిస్తోన్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ ‘విశ్వంభర’ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇందులో ఆయన ఒంటికన్ను రాక్షసుడితో ఫైట్ చేస్తారని, హాలీవుడ్ స్థాయిలో ఈ పోరాట సన్నివేశాన్ని తీర్చిదిద్దుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. సీజీ వర్క్ పెండింగ్ ఉండటంతో సినిమా రిలీజ్‌కు ఇంకొన్ని నెలలు పట్టే అవకాశముందని సమాచారం. వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో త్రిష హీరోయిన్. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
News April 8, 2026
అమెరికా ఓటమిని ఒప్పుకుంది: ఇరాన్

అమెరికా ఓటమిని ఒప్పుకొని తమ షరతులన్నింటికీ అంగీకరించిందని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది.
*ఇకపై దాడులు చేయదు
*హార్ముజ్‌పై ఇరాన్ నియంత్రణ కొనసాగింపు
*యురేనియం ఎన్‌రిచ్‌మెంట్‌కు అంగీకారం
*అన్ని ఆంక్షల ఎత్తివేత
*ఇరాన్‌కు పరిహారం చెల్లింపు
*రీజియన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ
*ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం
*ఇరాన్ బలగాల అనుమతితో హార్ముజ్ నుంచి ప్రయాణం


