News July 11, 2024

ఉక్రెయిన్‌ విషయంలో రష్యాతో వైరుధ్యాల్లేవు: కేంద్రం

image

ఉక్రెయిన్ విషయంలో భారత్ రష్యాతో విభేదించిందన్న వార్తల్ని కేంద్రం కొట్టిపారేసింది. ప్రధాని రష్యా పర్యటనలో డెలిగేషన్ స్థాయి సమావేశాన్ని కూడా భారత్ క్యాన్సిల్ చేసుకుందంటూ వచ్చిన వదంతులపై విదేశీ వ్యవహారాల కార్యదర్శి వినయ్ క్వాత్రా స్పష్టతనిచ్చారు. ‘నాకు తెలిసినంత వరకు అలాంటివేమీ జరగలేదు. వాస్తవం లేని ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో అర్థం కాదు. పీఎం రష్యా పర్యటన సూపర్ సక్సెస్ అయింది’ అని తెలిపారు.

Similar News

News January 12, 2026

పెట్టుబడుల డెస్టినేషన్‌గా ఏపీ: చంద్రబాబు

image

AP: దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25శాతం రాష్ట్రానికే వచ్చాయని మంత్రులు, అధికారుల సమావేశంలో సీఎం చంద్రబాబు తెలిపారు. దీంతో స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ల డెస్టినేషన్‌గా మారిందన్నారు. సీఐఐ ద్వారా చేసుకున్న ఒప్పందాలన్నీ సాకారం అయితే 16లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతిలో క్వాంటం వ్యాలీకి త్వరలో ఫౌండేషన్ వేయనున్నట్లు వెల్లడించారు.

News January 12, 2026

APPLY NOW: CSIR-CECRIలో ఉద్యోగాలు

image

<>CSIR<<>>-సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(CECRI)లో 15సైంటిస్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి PhD, ME, MTech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. జీతం నెలకు రూ.1,19,424 చెల్లిస్తారు. ఇంటర్వ్యూ, రాత పరీక్ష/సెమినార్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.cecri.res.in

News January 12, 2026

PSLVకి ‘మూడో మెట్టు’పైనే తడబాటు!

image

PSLV వరుసగా రెండు ప్రయోగాల్లో (C61, <<18833915>>C62<<>>) మూడో దశలోనే విఫలమవ్వడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ఈ దశలో ఘన ఇంధనం మండుతున్నప్పుడు రావాల్సిన థ్రస్ట్ తగ్గినా లేదా నాజిల్ కంట్రోల్ వ్యవస్థ వైఫల్యమైనా రాకెట్ దారి తప్పే అవకాశం ఉంటుంది. సరిగ్గా ఇదే కారణంతో C61 విఫలమైనట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు C62లోనూ అదే దశలో లోపం తలెత్తటంతో పాత తప్పిదాన్ని సరిదిద్దడంలో విఫలమయ్యారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి!