News July 11, 2024

స్వదేశానికి పయనమైన ప్రధాని మోదీ

image

రష్యా, ఆస్ట్రియా పర్యటనల్ని ముగించుకున్న ప్రధాని మోదీ స్వదేశానికి బయలుదేరారు. ఆయన కార్యాలయం ట్విటర్‌లో ఈ విషయాన్ని తెలిపింది. తన పర్యటన విజయవంతమైందని పీఎం ట్విటర్‌లో తెలిపారు. భారతీయులు తనపై చూపించిన ఆప్యాయతకు ముగ్ధుడనయ్యానని పేర్కొన్నారు. కాగా.. ఈ పర్యటనలో ప్రధానికి రష్యా అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోసిల్’ను పుతిన్ ప్రదానం చేసిన సంగతి తెలిసిందే.

Similar News

News January 26, 2026

RITESలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>RITES<<>> లిమిటెడ్‌లో 14 ఇండివిడ్యువల్ కన్సల్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. BE/BTech (సివిల్ ఇంజినీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్), పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జనవరి 27, 28తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి జీతం నెలకు రూ.1,00000-రూ.1,60,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://rites.com/

News January 26, 2026

ప్రెగ్నెన్సీలో నిద్రపట్టట్లేదా? ఈ టిప్స్ పాటించండి

image

నెలలు నిండే కొద్దీ గర్భిణుల్లో నిద్రలేమి పెరుగుతుంది. దీనికోసం కొన్ని చిట్కాలు చెబుతున్నారు వైద్యులు. ప్రెగ్నెన్సీలో డాక్టర్లు చెబితే తప్ప పూర్తి విశ్రాంతి తీసుకోకూడదు. తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ఒత్తిడి, ఆందోళనకు దూరంగా ఉండాలి. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, లేవడం అలవాటు చేసుకోవాలి. గ్యాడ్జెట్స్​కు దూరంగా ఉండాలి. నిద్రకు ముందు లైట్‌గా కాళ్లు, చేతులు, తల మసాజ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

News January 26, 2026

అమెరికా సీక్రెట్ వెపన్ పేరు చెప్పిన ట్రంప్‌

image

వెనిజులా అధ్యక్షుడు మదురోను పట్టుకునే ఆపరేషన్‌లో ‘డిస్కాంబోబులేటర్’ అనే సీక్రెట్ వెపన్ ఉపయోగించినట్లు ట్రంప్ వెల్లడించారు. ప్రత్యర్థి సైనిక పరికరాలు పూర్తిగా పనిచేయకుండా చేశామని, వారి వద్ద రష్యా, చైనా రాకెట్లు సిద్ధంగా ఉన్నప్పటికీ ఒక్కటి కూడా తమపై ప్రయోగించలేకపోయారని తెలిపారు. డ్రగ్స్ అక్రమ రవాణా చేసే వారిపై దాడులు మరింత విస్తరిస్తామని, అవసరమైతే మెక్సికో వరకూ చర్యలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు.