News July 11, 2024

తూ.గో: ఏడుగురి మృతికి కారణం.. జైలు పాలు

image

తూ.గో జిల్లాకు చెందిన ఏడుగురి మృతికి కారణమైన షేక్ మహబూబ్ జానీ అనే వ్యక్తికి యావజ్జీన కారాగార శిక్ష పడింది. వీరవల్లి ఏఎస్సై వివరాల మేరకు..2014లో ప్రమాదకర రసాయనాలు ఉన్న డ్రమ్ములను హైదరాబాద్ నుంచి తణుకుకు బయలుదేరాడు. దారి మధ్యలో తూ.గో జిల్లా వాసులు ఏడుగురిని వ్యానులో ఎక్కించుకున్నాడు. రసాయనాల నుంచి మంటలు వ్యాపించడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు . దీనిపై బుధవారం నూజివీడు న్యాయస్థానం తీర్పు చెప్పింది.

Similar News

News January 19, 2026

రాజమండ్రిలో ప్రయాణికుల కష్టాలు.. స్పందించిన మంత్రి

image

రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సులు లేక <<18899041>>ప్రయాణికులు <<>>పడుతున్న ఇబ్బందులపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తక్షణమే స్పందించారు. జిల్లా ప్రజా రవాణా అధికారితో మాట్లాడి విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లే ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ఇప్పటికే ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామని అధికారులు ఆయనకు వివరించారు.

News January 19, 2026

తూ.గో: ‘పంచాయతీ, రెవెన్యూ శాఖలకే అధిక వినతులు’

image

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన PGRSకు మొత్తం 147 అర్జీలు వచ్చాయి. కలెక్టర్, జేసీ వై.మేఘా స్వరూప్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వచ్చిన అర్జీలలో రెవెన్యూ విభాగానికి(రెవెన్యూ క్లినిక్) 62, పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధికి 59, హోంశాఖకు 9, వైద్యారోగ్య శాఖకు 17 దరఖాస్తులు అందాయి. ప్రజా ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహించకూడదని కలెక్టర్ ఆదేశించారు.

News January 19, 2026

తూ.గో: నేడు కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లినిక్

image

జనవరి 19న కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లినిక్, PGRS యథావిధిగా నిర్వహించనున్నట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ మేఘా స్వరూప్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా భూ సంబంధిత ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ వేదికను ఉపయోగిస్తున్నామన్నారు. భూ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.