News July 11, 2024

విజయనగరం: సచివాలయ కార్యదర్శులకు మెమోలు

image

విజయనగరం పట్టణంలోని గోకపేటలో 45వ సచివాలయాన్ని విజయనగరం కమిషనర్ మల్లయ్య నాయుడు బుధవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇద్దరు సచివాలయ కార్యదర్శులు విధులకు గైర్హాజరు కావడంతో వారికి శ్రీముఖాలు జారీ చేశారు. రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడంపై సిబ్బందిపై మండిపడ్డారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News July 11, 2025

జిందాల్ రైతుల‌కు చ‌ట్ట‌ప్ర‌కార‌మే ప‌రిహారం: క‌లెక్ట‌ర్

image

జిందాల్ భూముల‌కు సంబంధించి మిగిలిన రైతుల‌కు ప‌రిహారాన్ని వారం రోజుల్లో అందజేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ అంబేడ్కర్ ఆదేశించారు. జిందాల్‌కు కేటాయించిన‌ భూముల‌కు సంబంధించి విజయనగరంలోని త‌మ ఛాంబ‌ర్‌లో సంబంధిత అధికారుల‌తో శుక్ర‌వారం స‌మీక్షించారు. ఇప్ప‌టివ‌ర‌కు చెల్లించిన ప‌రిహారం, పెండింగ్ బ‌కాయిల‌పైనా ఆరా తీశారు. 28 ఎకరాల అసైన్డ్ భూములకు సంబంధించి 15 మందికి పరిహారం అందజేయాల్సి ఉందని తెలిపారు.

News July 11, 2025

సీజ‌న‌ల్ వ్యాధుల‌ను అరిక‌ట్టాలి: కలెక్టర్

image

సీజ‌న‌ల్ వ్యాధులు విజృంభించ‌కుండా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వైద్యారోగ్య‌శాఖ అధికారుల‌ను క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేడ్క‌ర్ ఆదేశించారు. రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.విజ‌యానంద్ క‌లెక్ట‌ర్ల‌తో గురువారం వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి, వివిధ అంశాల‌పై స‌మీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సీజ‌నల్ వ్యాధులు వ్యాప్తి చెంద‌కుండా క‌ట్టుధిట్టంగా చ‌ర్య‌లు తీసుకోవాలన్నారు.

News July 11, 2025

అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన

image

విజయనగరంలోని పోలీసు సంక్షేమ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి SP వకుల్ జిందల్ గురువారం శంకుస్థాపన చేశారు. రెండు అంతస్తుల్లో నాలుగు తరగతి గదుల నిర్మాణానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో తక్కువ ఫీజులతో పోలీసుల పిల్లలకు, ఇతర విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని భవనాలు నిర్మిస్తున్నామన్నారు.