News July 11, 2024

నెల్లూరు: ఆ బస్సుల్లో సాధారణ చార్జీలే వసూలు

image

నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగకు వచ్చే భక్తుల సౌకర్యం మేరకు ఆర్టీసి బస్సులు తిప్పనున్నట్లు ఆర్ఎం విజయరత్నం తెలిపారు. జిల్లా బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ ఈ నెల 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లా నలుమూలల నుంచి దర్గా వరకు 44 ప్రత్యేక బస్సులను తిప్పనున్నట్లు ఆర్ఎం చెప్పారు. ఈ బస్సుల్లో సాధారణ చార్జీలే వసూలు చేస్తామని ప్రకటించారు.

Similar News

News January 13, 2026

నెల్లూరు ఎస్పీ గ్రీవెన్స్‌కి 105 అర్జీలు

image

నెల్లూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే సోమవారం నిర్వహించారు. ఎస్పీ అజిత వేజెండ్ల బాధితుల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 105 అర్జీలు వచ్చాయని తెలిపారు. వాటిలో ఎక్కువగా చీటింగ్ కేసులకు సంభందించి అర్జీలు వచ్చాయి. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. వచ్చిన ప్రతి అర్జీకి జవాబుదారీగా ఉండి సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలని అధికారులను కోరారు.

News January 12, 2026

నెల్లూరు: మన నిమ్మకు.. ఉత్తరాదిన ధీమా.!

image

నెల్లూరు జిల్లా నుంచి దేశంలో పలు ప్రాంతాలకు అత్యధికంగా నిమ్మ పంట ఎగుమతి అవుతుంది. ఢిల్లీ, బిహార్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, UPలకు సీజన్‌లో ఎక్కువగా, అన్ సీజన్ TN, కర్ణాటక, కేరళకు వెళ్తున్నాయి. 23-24లో 50628 క్వింటాళ్లు (రూ.14.99 cr), 24-25లో 36579 క్వింటాళ్లు (రూ.14.73cr), 25-26లో 21631 క్వింటాళ్లు (రూ.6.16cr) విక్రయాలు జరిగాయి. ప్రస్తుత కలెక్టర్ చొరవతో నిమ్మ KG రూ.22 ఉందని రైతులన్నారు.

News January 12, 2026

నెల్లూరు ఎస్పీ గ్రీవెన్స్‌కి 105 అర్జీలు

image

నెల్లూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఎస్పీ అజిత వేజెండ్ల బాధితుల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 105 అర్జీలు వచ్చాయని తెలిపారు. వాటిలో ఎక్కువగా చీటింగ్ కేసులకు సంభందించి అర్జీలు వచ్చాయి. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. వచ్చిన ప్రతి అర్జీకి జవాబుదారీగా ఉండి సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలని అధికారులను కోరారు.