News July 11, 2024

ఉమ్మడి జిల్లాలో గృహలక్ష్మి సంఖ్య@3,85,343

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 8,54,491 మంది గృహ విద్యుత్తు వినియోగదారులు ఉండగా.. వీరిలో 5,12,694 మంది గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా 1,27,351 మందికి ‘0’బిల్లులు రావాల్సి ఉందని విద్యుత్ అధికారులు తెలిపారు. జూన్ మాసంలో 3,65,311 మంది గృహ విద్యుత్తు వినియోగదారులు ‘0’ బిల్లులు అందుకోగా, జులైలో ఈ సంఖ్య 3,85,343లకు చేరింది. ఉమ్మడి జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య మరో 20 వేలకు పెరిగింది.

Similar News

News January 14, 2026

పాలమూరు: బొటానికల్ గార్డెన్‌లో అరుదైన పుట్టగొడుగు

image

జడ్చర్ల డా.బీఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్ మరో అరుదైన జీవజాతికి నిలయమైంది. ఇక్కడ ‘కాప్రినొప్సిస్ నివియా’ అనే అరుదైన పుట్టగొడుగును ప్రొఫెసర్ సదాశివయ్య బృందం గుర్తించింది. దీని ఫలనాంగాలు మంచు రంగులో ఉండి, మంచుతో కప్పబడినట్లు కనిపిస్తాయి. అందుకే దీనిని ‘స్నోయి ఇంకాంప్’ అని పిలుస్తారు. ఒకటి లేదా రెండు రోజుల్లోనే తన జీవిత చక్రాన్ని ముగిస్తుందని ప్రొఫెసర్ వివరించారు.

News January 14, 2026

పాలమూరు: ఈనాటి ముఖ్య వార్తలు!!

image

✒T-20 లీగ్.. అదిలాబాద్ పై మహబూబ్ నగర్ ఘనవిజయం
✒అభివృద్ధి కేంద్ర నిధులతోనే: ఎంపీ డీకే అరుణ
✒ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు
✒పలు గ్రామాల్లో క్రీడా పోటీలు
✒పాలమూరు: రోడ్డు ప్రమాదం.. తల్లీకుమార్తె మృతి
✒GDWL:భార్య కాపురానికి రావడంలేదని గొంతు కోసుకున్న భర్త
✒నాగర్‌కర్నూలు: ఐదుగురు ఏఈఓల సస్పెన్షన్
✒ఈనెల 19 నుంచి జోగులాంబ బ్రహ్మోత్సవాలు

News January 13, 2026

MBNR: సిరి వెంకటాపూర్‌లో 17.2 డిగ్రీల ఉష్ణోగ్రత

image

మహబూబ్‌నగర్‌ జిల్లాలో గత 24 గంటల్లో చలి తీవ్రత స్వల్పంగా తగ్గింది. కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్‌లో అత్యల్పంగా 17.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేవరకద్రలో 15.5, కొల్లూరులో 17.9, కౌకుంట్ల 18.0, సల్కర్‌పేటలో 18.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడిచిన కొద్దిరోజులతో పోలిస్తే రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరగడంతో జిల్లా ప్రజలకు చలి నుంచి కాస్త ఉపశమనం లభించింది.