News July 11, 2024

ఉపాధి కల్పనపై కేంద్రం రిపోర్ట్స్.. నిపుణులు ఏమంటున్నారంటే?

image

బడ్జెట్ సమీపిస్తున్న వేళ ఉపాధి కల్పనకు సంబంధించిన గణాంకాలు చర్చనీయాంశమయ్యాయి. FY24లో 4.67కోట్ల ఉద్యోగాలు (మొత్తంగా 64.33కోట్లు) వచ్చాయని RBI చెబుతోంది. CITI BANK నివేదికకు (2012 నుంచి ఏటా 88లక్షల జాబ్స్) కౌంటర్‌‌గా ఏటా సగటున 2కోట్ల జాబ్స్ వచ్చినట్లు కేంద్రం పేర్కొంది. కేంద్ర, RBI నివేదికలతో కొందరు ఏకీభవిస్తుంటే.. స్వీయఉపాధి, సాగు రంగాల్లో వృద్ధి ఉందని ఉద్యోగాల్లో కాదని మరికొందరు తప్పుపడుతున్నారు.

Similar News

News January 19, 2025

WK ఎంపికపై గంభీర్, రోహిత్ మధ్య డిబేట్?

image

ఛాంపియన్స్ ట్రోఫీ <<15185531>>జట్టు<<>> ఎంపిక సమయంలో హెడ్ కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య తీవ్ర చర్చ జరిగినట్లు తెలుస్తోంది. హార్దిక్‌ను వైస్ కెప్టెన్ చేయాలని, సెకండ్ వికెట్ కీపర్‌గా శాంసన్‌ను తీసుకోవాలని గంభీర్ సూచించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. కానీ VCగా గిల్, WKగా పంత్‌ను తీసుకోవడానికే చీఫ్ సెలక్టర్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ మొగ్గు చూపినట్లు తెలిపింది.

News January 19, 2025

రేషనలైజేషన్‌ను తప్పుబడుతోన్న ఉద్యోగ సంఘాలు

image

AP: గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలో హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) చేపట్టాలన్న నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని సచివాలయ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దీని వల్ల ఉద్యోగులపై తీవ్రమైన పని భారం పెరిగే అవకాశం ఉందని తెలిపాయి. మల్టీపర్పస్ ఉద్యోగులు అనే పేరుతో వివిధ పనులకు సచివాలయ ఉద్యోగులను వినియోగించుకోవాలనుకోవడం సరికాదని పేర్కొన్నాయి.

News January 19, 2025

OTTలోకి వచ్చేసిన కొత్త సినిమా

image

విజయ్ సేతుపతి నటించిన ‘విడుదల పార్ట్-2’ OTTలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పార్ట్-1 స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టలేకపోయింది. పార్ట్-1 కూడా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.