News July 11, 2024

తిరుపతి లాయర్‌కు స్టేట్ 5th ర్యాంక్

image

వారిది సాధారణ రైతు కుటుంబం. చిన్నప్పుడే తండ్రి మృతి చెందాడు. తల్లి, సోదరుడి ప్రోత్సహంతో మనుషా రాష్ట్ర స్థాయి PG లాసెట్‌లో ఐదో ర్యాంకు సాధించింది. పొదలకూరు(M) లింగంపల్లి గ్రామానికి చెందిన గుండ్రా మస్తాన్‌రెడ్డి, మాధవిల కుమార్తె పదో తరగతి వరకు పొదలకూరు బాలికల ZP హైస్కూల్లో చదివింది. తిరుపతి SVUలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి ఇక్కడే న్యాయవాదిగా పనిచేస్తోంది. న్యాయమూర్తి కావడమే లక్ష్యమని మనుషా పేర్కొంది.

Similar News

News January 1, 2026

పార్లమెంటులో 101 అడిగిన మిథున్ రెడ్డి

image

2025వ సంవత్సరంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పార్లమెంటులో వివిధ సమస్యలపై మొత్తం 101 ప్రశ్నలు అడిగారు. ఆయన హాజరు శాతం 55%గా ఉంది. మొత్తం 12 చర్చ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. బడ్జెట్, ఉపాధి హామీ పథక అమలుపై నిర్వహించిన చర్చల్లో ఆయన పాల్గొన్నారు.

News January 1, 2026

చిత్తూరు MPకి 94 శాతం హాజరు

image

2025 సంవత్సరంలో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పార్లమెంటుకు 94 శాతం హాజరయ్యారు. మొత్తం 122 ప్రశ్నలను పార్లమెంటులో అడిగారు. ఏడు అంశాలకు సంబంధించిన డిబేట్స్ లో ఆయన పాల్గొన్నారు.

News January 1, 2026

చిత్తూరు కలెక్టర్‌కు శుభాకాంక్షల వెల్లువ

image

చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్‌ను పలువురు అధికారులు గురువారం కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. బొకేలు, పండ్లు అందజేశారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో JC విద్యాధరి, డీఆర్వో మోహన్ కుమార్, మునిసిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్, ఎస్ఎస్పీఎ వెంకటరమణ, డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, ఐఅండ్ పీఆర్ అధికారి వేలాయుధం తదితరులు ఉన్నారు.