News July 11, 2024
భీమవరం: పుణ్య క్షేత్రాల సందర్శనకు ‘భారత్ గౌరవ్’
భారతీయ రైల్వే సంస్థ (ఐఆర్సీటీసీ) దేశంలోని పర్యాటక ప్రదేశాలు, పుణ్య క్షేత్రాల సందర్శనకు భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ పేరుతో ప్రత్యేక రైళ్లు నడుపుతుందని ఏరియా మేనేజర్ ఎం. రాజు తెలిపారు. దీనికి సంబంధించి భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. జ్యోతిర్లింగ దివ్య దక్షిణయాత్ర పేరుతో ఆగస్టు 4న ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Similar News
News November 27, 2024
నన్ను కొట్టిన వాళ్లంతా జైలుకు వెళ్తారు: RRR
ఉండి MLA, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమ రాజు(RRR) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘గత ప్రభుత్వంలో నాపై కేసు పెట్టారు. విచారణలో భాగంగా కొందరు అధికారులు నన్ను కొట్టారు. ఇప్పుడు వాళ్లంతా జైలుకు వెళ్లడం ఖాయం. సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్‌పాల్ అరెస్ట్‌ను స్వాగతిస్తున్నా. ఈ కేసులో కీలకంగా ఉన్న సీఐడీ మాజీ చీఫ్ సునీల్ విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది. ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలి’ అని RRR కోరారు.
News November 27, 2024
ఉండి యువతికి కీలక ఉద్యోగం
దేశస్థాయిలో ప.గో జిల్లా యువతి సత్తా చాటారు. ఉండి పెదపేటకు చెందిన నిస్సీ ప్లోరా డిగ్రీ BSC చదివారు. తర్వాత ఆమె హార్టికల్చర్ విభాగంలో పీహెచ్డీ చేశారు. దేశంలోని 16 కీలక పోస్టులకు 16 వేల మంది పరీక్షలు రాశారు. ఈక్రమంలో నిస్సీ ఫ్లోరా ప్రతిభ చూపి అహ్మదాబాద్‌లోని నేషనల్ హార్టీకల్చర్ డిప్యూటీ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. నిస్సీ తండ్రి ఏసురత్నం రిటైర్డ్ టీచర్. తల్లి వర్జీనియా స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు.
News November 27, 2024
భీమవరం నుంచి మలేషియా పంపి మోసం
మలేషియా పంపి మోసం చేసిన ఘటన భీమవరంలో జరిగింది. ‘నేను భీమవరంలోని మోటుపల్లివారి వీధిలో ఉంటున్నా. ప్రకాశ్ నగర్‌కు చెందిన ఓ మహిళ రూ.1.50 లక్షలు తీసుకుని పంబ్లింగ్ పని కోసం నన్ను మలేషియా పంపింది. కానీ ఓ హోటల్లో పనికి పెట్టి జీతం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. తిరిగి భీమవరం పంపాలని నా భార్య ఆ మహిళను కోరినా పట్టించుకోలేదు. తెలిసిన వాళ్ల ద్వారా భీమవరం వచ్చా’ అని బాధితుడు నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.