News July 11, 2024

ఉమ్మడి జిల్లాలో నమోదైన వర్షపాత వివరాలు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో 25.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నారాయణపేట జిల్లా మరికల్లో 22.0 మి.మీ, నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెరలో 1.3 మి.మీ, వనపర్తి జిల్లా సోలిపూర్లో 1.0 మి.మీ, గద్వాల జిల్లాలో ‘0’ మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

Similar News

News October 2, 2024

నాగర్ కర్నూల్‌ను నాశనంచేస్తున్న తండ్రి, కొడుకు:మర్రి జనార్దన్ రెడ్డి

image

సగం తెలిసిన MLC, అనుభవం లేని MLA నాగర్ కర్నూల్ నియోజకవర్గాన్ని నాశనం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. MLC దామోదర్ రెడ్డి, MLA రాజేష్ రెడ్డిలను ఉద్దేశించి విమర్శించారు. ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. అవినీతిపై ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని అన్నారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చి తనకంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపించాలని మాజీ ఎమ్మెల్యే వారికి సవాల్ విసిరారు.

News October 1, 2024

NGKL: డీఎస్సీ ఫలితాల్లో రెండు జిల్లాల్లో డిస్ట్రిక్ టాపర్

image

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లిలోని నిరుపేద కుటుంబానికి చెందిన కే. స్వప్న తాజా డీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటింది. SGT తెలుగులో 84.90 మార్కులు సాధించి నాగర్ కర్నూల్ జిల్లా స్థాయిలో 1st ర్యాంక్ సాధించింది. అలాగే SGT ఇంగ్లిష్‌లో 87.90 మార్కులు సాధించి హైదరాబాద్ జిల్లా స్థాయిలో 1st ర్యాంక్ సాధించింది. ఫలితాల్లో స్వప్న సత్తా చాటడంతో సన్నిహితులు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News October 1, 2024

MBNR: ఉమ్మడి జిల్లాలో తగ్గుతున్న అమ్మాయిలు !

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 3ఏళ్లుగా జననాల రేటులో అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. గత ఏడాదిలో బాలురు 28,891 జననాలు నమోదు కాగా.. అమ్మాయిలు 25,822 మంది మాత్రమే మాత్రమే జన్మించారు. పలు స్కానింగ్ కేంద్రాల్లో బేబీ జెండర్ గురించి చెప్తున్నట్లు సమాచారం. ఇలాగైతే బాలికల శాతం తగ్గనుంది. బాలికల కోసం సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ స్కానింగ్ కేంద్రాలు తనిఖీలు చేస్తున్నామని DMHO పద్మా తెలిపారు.