News July 11, 2024
ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు మెరిట్ లిస్ట్ విడుదల

AP RGUKT పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు సంబంధించి అభ్యర్థుల మెరిట్ జాబితా విడుదలైంది. ఛాన్స్‌లర్ ఆచార్య కేసిరెడ్డి లిస్టును విడుదల చేశారు. మొత్తం నాలుగు వేల సీట్లు ఉండగా ఈ ఏడాది ఏకంగా 53,863 దరఖాస్తులు వచ్చాయి. www.rgukt.in వెబ్‌సైట్ నుంచి విద్యార్థులు కాల్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకుని నిర్ణీత తేదీల్లో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని అధికారులు సూచించారు.
Similar News
News October 24, 2025
పొలిటికల్ టర్న్ తీసుకున్న వైద్యురాలి ఆత్మహత్య కేసు

MHలో సంచలనం రేపిన వైద్యురాలి <<18091644>>ఆత్మహత్య<<>> కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. పోస్టుమార్టమ్ రిపోర్ట్‌ను ‘మేనేజ్’ చేయాలంటూ డాక్టర్‌పై ఒత్తిడి చేస్తున్నారని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో పాటు రాజకీయ నేతలు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్లు మండిపడుతున్నారు. అటు CM ఫడణవీస్ ఆదేశాలతో ప్రధాన నిందితుడు SI గోపాల్‌ను సస్పెండ్ చేశారు.
News October 24, 2025
మ్యాచ్ రద్దు.. WCలో పాక్‌కు ఘోర అవమానం

ఉమెన్స్ వరల్డ్ కప్‌లో ఇవాళ పాక్, శ్రీలంక మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. పాక్ బ్యాటింగ్ ప్రారంభించిన కాసేపటికే భారీ వర్షం పడగా అంపైర్లు మ్యాచ్ రద్దు చేశారు. అంతకుముందే ఇరు జట్లు సెమీస్ రేస్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. మొత్తం 7 మ్యాచ్‌ల్లో పాక్ ఒక్కటీ గెలవలేదు. 4 మ్యాచ్‌ల్లో ఓడిపోగా 3 రద్దయ్యాయి. దీంతో ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఏకైక జట్టుగా ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది.
News October 24, 2025
చిన్న కాంట్రాక్టర్లకు తీపి కబురు

TG: ఆర్‌అండ్‌బీ చిన్న కాంట్రాక్టర్లకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీపి కబురు అందించారు. సీఎం రేవంత్‌తో మాట్లాడి రూ.100 కోట్ల పెండింగ్ బిల్లుల పేమెంట్‌కు కృషి చేసినట్లు వివరించారు. మిగతా రూ.50 కోట్ల పెండింగ్ బిల్లులు కూడా త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న బిల్లులను మంజూరు చేసిన సీఎం, మంత్రికి రాష్ట్ర బిల్డర్స్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపింది.


