News July 11, 2024
వైసీపీ నాయకులు ఆర్థిక నేరగాళ్లు: సీఎం చంద్రబాబు

వైసీపీ నాయకులపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల పాలనలో విశాఖ సహా ఉత్తరాంధ్రలో వనరులను, ప్రకృతిని దోచుకున్న ఆర్థిక నేరగాళ్లు.. వైసీపీ నాయకులని అన్నారు. గురువారం దార్లపూడిలో జరిగిన సభలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. ప్రజల సొమ్మును దోచుకున్న ఆర్థిక నేరగాళ్లను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం హెచ్చరించారు. వైసీపీ అంటే అబద్ధాల పార్టీ అని దుయ్యబట్టారు.
Similar News
News January 19, 2026
విశాఖ జాయింట్ కలెక్టర్‌గా విద్యాధరి బాధ్యతల స్వీకరణ

విశాఖపట్నం జిల్లా నూతన జాయింట్ కలెక్టర్‌గా గొబ్బిళ్ల విద్యాధరి సోమవారం తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కార్యాలయ సిబ్బందిని ఆమె పరిచయం చేసుకున్నారు. విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పని చేసిన మయూర్ అశోక్ బదిలీపై గుంటూరు వెళ్లారు. ప్రజల సమస్యలు పరిష్కారానికి సత్వర చర్యలు చేపడతామని ఆమె పేర్కొన్నారు.
News January 19, 2026
వినతుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే మెమోలు: కలెక్టర్

విశాఖ కలెక్టరేట్ మీటింగు హాలులో సోమవారం కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పీజీఆర్ఎస్ నిర్వహించారు. అంతకుముందు అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రజలు ఇచ్చే ఫిర్యాదులకు పరిష్కారం చూపాలన్నారు. జీవీఎంసీలో సాధారణ, టౌన్ ప్లానింగ్ వినతులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకోవాలని అదనపు కమిషనర్‌కి ఆదేశించారు. అలసత్వం వహిస్తే 2 సార్లు మెమోలు ఇవ్వాలని, మూడోసారి ఛార్జి మెమో ఇవ్వాలన్నారు.
News January 19, 2026
విశాఖ: ఫిర్యాదులు చేసేందుకు ఎవరూ రాలేదు!

ప్రతి సోమవారం జీవీఎంసీలో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ 10 గంటలకు ప్రారంభమైనా ఫిర్యాదుదారులు కనిపించలేదు. మరోవైపు అధికారులు కూడా సగానికి పైగా లేకపోవడం విశేషం. అన్ని సీట్లు ఖాళీగా దర్శనం ఇవ్వడంతో వచ్చిన వారు విస్తుపోతున్నారు. పండగ ఎఫెక్ట్ కారణంగా ఈ పరిస్థితి ఎదురైందని పలువురు భావిస్తున్నారు.


