News July 11, 2024
ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు
ఈ నెల 24వ తేదీ నుంచి తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ నిర్వహణపై స్పీకర్ తాజాగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ విప్‌లు, సీఎస్, డీజీపీ, ఇతర అధికారులు హాజరయ్యారు.
Similar News
News January 19, 2025
రాజకీయాల్లోకి ‘కట్టప్ప’ కూతురు
ప్రముఖ నటుడు సత్యరాజ్ కూతురు దివ్య రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ సమక్షంలో డీఎంకే పార్టీలో చేరారు. ఆమె తమిళనాడులో ప్రముఖ పోషకాహార నిపుణులు (న్యూట్రిషనిస్ట్)గా గుర్తింపు పొందారు. కాగా సత్యరాజ్ బాహుబలి, బాహుబలి-2 సినిమాల్లో కట్టప్పగా నటించి దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు.
News January 19, 2025
WEIGHT LOSS: 145kgs నుంచి 75kgలకు!
అజర్ హాసన్ అనే యువకుడు నాలుగేళ్లలో 70 కేజీల బరువు తగ్గి ఫిట్‌నెస్ మోడల్‌గా మారాడు. ఇందులో 55KGS 7 నెలల్లోనే తగ్గినట్లు చెప్పారు. అతడి బాడీ ఫ్యాట్ 55% నుంచి 9%కి తగ్గింది. సరైన శిక్షణ, కఠోర శ్రమ, బ్యాలన్స్‌డ్ డైట్‌తో ఇది సాధ్యమైందన్నారు. తన తండ్రి మృతదేహాన్ని సమాధిలో పెట్టేటప్పుడు ఊబకాయం వల్ల కిందికి వంగలేకపోయానని, ఆ తర్వాత శ్రమించి బరువు తగ్గినట్లు MTV రోడీస్ షోలో అజర్ తెలిపారు.
News January 19, 2025
ఒకే ఫ్లెక్సీలో చంద్రబాబు, పవన్, KCR, KTR
TGలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, KCR, KTR ఫొటోలతో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘట్‌కేసర్ గట్టు మైసమ్మ జాతర సందర్భంగా అభిమానులు దీనిని ఏర్పాటు చేశారు. ఇందులో CBNకు బాస్ ఈజ్ బ్యాక్, పవన్‌కు ట్రెండ్ సెట్టర్, KCRకు గాడ్ ఆఫ్ TG కమింగ్ సూన్, KTRకు ఫ్యూచర్ ఆఫ్ TG అని క్యాప్షన్స్ పెట్టారు. సీనియర్ NTR, లోకేశ్, చిరంజీవి, హరీశ్ రావు ఫొటోలు కూడా ఆ బ్యానర్‌లో ఉండటం గమనార్హం.