News July 11, 2024

మోదీ సంపన్నుల ఖజానా నింపుతున్నారు: కాంగ్రెస్

image

భారతదేశంలో ధనికులు, పేదల మధ్య అంతరం నిరంతరం పెరుగుతోందని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ధనికులు మరింత ధనవంతులుగా, పేదలు మరింత పేదలుగా మారుతున్నారని పేర్కొంది. మోదీ పేదల జేబుల్లోంచి డబ్బు కొల్లగొట్టి సంపన్నుల ఖజానా నింపుతున్నారని ఆరోపించింది. దేశంలో దాదాపు 70కోట్ల మంది నెలకు రూ.5,930, 1.4 కోట్ల మంది నెలకు రూ.4,41,666 చొప్పున సంపాదిస్తున్నారని పేర్కొంది.

Similar News

News January 20, 2025

₹17 లక్షల పరిహారం ఇవ్వాలన్న జడ్జి.. అవసరం లేదన్న పేరెంట్స్

image

ట్రైనీ వైద్యురాలి హత్యాచార కేసు తీర్పు వెల్లడించిన న్యాయమూర్తి అనిర్బన్ దాస్ పరిహారంపై సైతం ఆదేశాలిచ్చారు. బాధిత కుటుంబానికి బెంగాల్ ప్రభుత్వం రూ.17 లక్షలు పరిహారం ఇవ్వాలని తీర్పులో పేర్కొన్నారు. అత్యంత అరుదైన ఈ కేసులో ఉరి శిక్ష విధించాలని CBI లాయర్ వాదించారు. కానీ దీన్ని అత్యంత అరుదైన కేసుగా పరిగణించలేమని జడ్జి తెలిపారు. అటు తమకు పరిహారం అవసరం లేదని అభయ తండ్రి ప్రకటించారు.

News January 20, 2025

నిందితుడికి జీవితఖైదు.. బాధితురాలి పేరెంట్స్ ఆందోళన

image

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సీల్దా కోర్టు దోషి సంజయ్ రాయ్‌కి జీవితఖైదు విధించడంపై బాధితురాలి పేరెంట్స్ ఆందోళనకు దిగారు. అతడికి ఉరిశిక్ష విధించాలని కోర్టు హాల్‌లో డిమాండ్ చేశారు. అప్పుడే తమ కూతురికి న్యాయం జరిగినట్లని వారు పేర్కొన్నారు. అటు ఈ దారుణం వెనుక మరింత మంది ఉన్నారని, సీబీఐ సరిగ్గా దర్యాప్తు చేయలేదని వారు వాదిస్తూ వస్తున్నారు.

News January 20, 2025

BIG BREAKING: కోల్‌కతా హత్యాచార దోషికి శిక్ష ఖరారు

image

దేశంలో సంచలనం సృష్టించిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్‌కు సీల్దా కోర్టు జీవిత ఖైదు విధించింది. BNS 64, 66, 103/1 ప్రకారం ఖైదుతో పాటు, ₹50 వేల జరిమానా విధిస్తూ తీర్పిచ్చింది. 2024 AUG 9న RG Kar మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థిని అత్యాచారం, హత్యకు గురైంది. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ దారుణానికి ఒడిగట్టిన వారికి ఉరే సరైన నిర్ణయమని డిమాండ్లు వచ్చాయి.