News July 11, 2024
ITR ఫైలింగ్‌కు ఆటంకం!
ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు జులై 31తో గడువు ముగుస్తుండటంతో చాలామంది ఫైల్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాగా ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో సమస్యలున్నాయని, ‘సర్వీస్ అనవైలబుల్’ అని వస్తోందని కొందరు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేస్తున్నారు. గడువు పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన IT శాఖ యూజర్లు తమ బ్రౌజర్‌లో క్యాచీని క్లియర్ చేసి మరోసారి ప్రయత్నించాలని సూచించింది.
Similar News
News January 20, 2025
పంచాయతీ క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపు: Dy.CM పవన్
AP: గ్రామీణ ప్రజలకు నిరంతరాయంగా పంచాయతీ సేవలు అందేలా చూడాలని అధికారులను Dy.CM పవన్ ఆదేశించారు. పంచాయతీల క్లస్టర్ విధానంలో మార్పులు చేపట్టి, కొత్త గైడ్‌లైన్స్‌ను రూపొందించాలన్నారు. క్లస్టర్ గ్రేడ్ల విభజనకు ఆదాయం, జనాభాను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించారు. క్లస్టర్ల విభజన, గ్రేడ్ల కేటాయింపుపై కమిటీని ఏర్పాటు చేయాలని, కమిటీ నివేదిక ప్రకారం పంచాయతీ, సచివాలయ సిబ్బందిని కేటాయించాలన్నారు.
News January 20, 2025
సంభల్ అల్లర్లు: పాక్ కుట్రపై డౌట్!
సంభల్ అల్లర్లలో పాక్ కుట్రకోణంపై డౌట్ వస్తోంది. తుపాకీతో కాల్పులు జరిపిన ముల్లా అఫ్రోజ్‌కు దావూద్ ఇబ్రహీం గ్యాంగుతో సంబంధాలు బయటపడటమే ఇందుకు కారణం. లగ్జరీ కార్ల చోరీ మాస్టర్ మైండ్ షారిక్ షాటా తరఫునే తానీ పనిచేసినట్టు అఫ్రోజ్ అంగీకరించాడు. అతడు కాల్చిన .32 పిస్టల్ బుల్లెట్లు పాక్‌లో తయారైనవే. షారిక్‌కు ISI, D గ్యాంగుతో లింక్ ఉన్నట్టు తెలిసింది. ఇక సంభల్ కేసులో 70 మందిని అరెస్టు చేయడం తెలిసిందే.
News January 20, 2025
₹17 లక్షల పరిహారం ఇవ్వాలన్న జడ్జి.. అవసరం లేదన్న పేరెంట్స్
ట్రైనీ వైద్యురాలి హత్యాచార కేసు తీర్పు వెల్లడించిన న్యాయమూర్తి అనిర్బన్ దాస్ పరిహారంపై సైతం ఆదేశాలిచ్చారు. బాధిత కుటుంబానికి బెంగాల్ ప్రభుత్వం రూ.17 లక్షలు పరిహారం ఇవ్వాలని తీర్పులో పేర్కొన్నారు. అత్యంత అరుదైన ఈ కేసులో ఉరి శిక్ష విధించాలని CBI లాయర్ వాదించారు. కానీ దీన్ని అత్యంత అరుదైన కేసుగా పరిగణించలేమని జడ్జి తెలిపారు. అటు తమకు పరిహారం అవసరం లేదని అభయ తండ్రి ప్రకటించారు.