News July 11, 2024
పేరెంట్స్‌తో గడపడానికి 2 రోజులు స్పెషల్ లీవ్

తల్లిదండ్రులు/ అత్తమామలతో గడపడానికి వీలుగా ఉద్యోగులకు 2 రోజులు స్పెషల్ క్యాజువల్ లీవ్స్‌ను ఇవ్వనున్నట్లు అస్సాం ప్రభుత్వం తెలిపింది. నవంబర్ 6, 8 తేదీల్లో ఈ సెలవులు అందుబాటులోకి వస్తాయంది. 7న ఛత్ పూజ, 9న రెండో శనివారం, 10న ఆదివారం కావడంతో వరుసగా 5 రోజులు లీవ్స్ వస్తాయని పేర్కొంది. వీటిని వ్యక్తిగత ఎంజాయ్‌మెంట్ కోసం ఉపయోగించొద్దని స్పష్టం చేసింది. పేరెంట్స్, అత్తమామలు లేనివారికి ఈ సెలవులు ఉండవు.
Similar News
News January 7, 2026
రాజకీయ ఉనికి కోసం గంటా పోరాటం(2/2)

ఈ క్రమంలో జిల్లాలో గతంలో గంటాకు నడిచినంత హవా ఇప్పుడు లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇప్పటివరకు గంటా వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉన్నారు. అయితే ఇటీవల తన సహజ శైలికి భిన్నంగా ప్రత్యర్థి పార్టీలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. పార్టీ అధినాయకత్వం దృష్టిలో పడేందుకు, వారసుడి ఎంట్రీ, రాజకీయ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఆయన వైఖరిలో మార్పు కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
News January 7, 2026
ఫ్యామిలీతో జల విహారం చేస్తారా?

APలోనే తొలిసారి ఎన్టీఆర్(D) ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కేరళ తరహా ఫ్లోటెడ్ బోట్లను అధికారులు ఏర్పాటుచేశారు. రేపు సీఎం చంద్రబాబు వీటిని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత రాజమండ్రి, నెల్లూరు, కడప తదితర 11 ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ బోట్లలో ఒక బెడ్, టీవీ, కుర్చీలు, వెస్ట్రన్ టాయిలెట్, హాల్ సౌకర్యాలుంటాయి. 24 గంటలపాటు ఫ్యామిలీతో జలవిహారం చేయొచ్చు. ధర రూ.8వేల వరకు ఉంటుంది.
News January 7, 2026
LIC జీవన్ ఉత్సవ్.. బెనిఫిట్స్ ఇవే

LIC కొత్తగా జీవన్ ఉత్సవ్ పాలసీని ఆవిష్కరించింది. ఇందులో జీవితాంతం ఆదాయం, బీమా రక్షణ లభిస్తుందని తెలిపింది. JAN 12 నుంచి స్కీమ్ అందుబాటులో ఉంటుంది. నెల వయసు పిల్లల నుంచి 65ఏళ్ల వరకు ఈ పాలసీకి అర్హులు. కనీస బీమా మొత్తం ₹5L. గరిష్ఠ పరిమితి లేదు. ప్రతి ₹వెయ్యికి ఏటా₹40 చొప్పున జమ అవుతుంది. 7-17ఏళ్ల తర్వాత ప్రైమరీ బీమా మొత్తంలో 10% ఆదాయం లభిస్తుంది. దీన్ని LIC వద్దే ఉంచితే 5.5% చక్రవడ్డీ చెల్లిస్తుంది.


