News July 11, 2024
YCP నేత వల్లభనేని వంశీపై కేసు నమోదు

AP: గన్నవరంలో TDP కార్యాలయం ధ్వంసం ఘటనకు సంబంధించి YCP నేత వల్లభనేని వంశీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ-71గా ఆయన పేరును చేర్చారు. పరారీలో ఉన్న వంశీ ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇదే కేసులో కొడాలి నాని, పేర్ని నాని పేర్లు కూడా చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై కొంతమంది దుండగులు దాడి చేసి నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే.
Similar News
News August 31, 2025
వచ్చే నెల 6న ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం

TG: ఖైరతాబాద్ విశ్వశాంతి మహా గణపతిని సెప్టెంబర్ 6న నిమజ్జనం చేయనున్నట్లు ఉత్సవ సమితి ప్రకటించింది. సెప్టెంబర్ 7న చంద్ర గ్రహణం ఉండటంతో వినాయక నిమజ్జనాలపై అనేక సందేహాలు నెలకొన్న నేపథ్యంలో స్పష్టతనిచ్చింది. ఇవాళ ఆదివారం కావడంతో ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.
News August 31, 2025
అల్లు అరవింద్, బన్నీని ఓదార్చిన పవన్ కళ్యాణ్

దివంగత హాస్యనటుడు అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నం మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం ప్రకటించారు. హైదరాబాద్‌లోని అల్లు అరవింద్ నివాసానికి వెళ్లి ఆయనతో పాటు అల్లు అర్జున్ను ఓదార్చారు. ఇతర కుటుంబ సభ్యులనూ పరామర్శించారు. వృద్ధాప్య సమస్యలతో కనకరత్నం (94) నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే.
News August 31, 2025
సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు: KTR

TG: BC రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ను ఆమోదించని గవర్నర్ బిల్లుపై సంతకం పెడతారా అని ప్రభుత్వాన్ని KTR ప్రశ్నించారు. ‘అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినంత మాత్రాన అమలు కాదు కదా. గవర్నర్‌తో బలవంతంగా సంతకం పెట్టిస్తారా? సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు? BC రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే CM రేవంత్ ఢిల్లీలో నిరాహార దీక్ష చేయాలి’ అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాలను 15 రోజులపాటు నిర్వహించాలన్నారు.