News July 11, 2024
ANU: 4వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏప్రిల్ 16 నుంచి 29 వరకు నిర్వహించిన 4వ సెమిస్టర్ రెగ్యులర్& సప్లిమెంటరీ BA, BCom, BSc, BCA పరీక్షా ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య సంధ్యా కోల్ విడుదల చేశారు. ఈ ఫలితాలలో మొత్తం 14,544 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 8,439 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్ www.anu.ac.in నుంచి పొందవచ్చన్నారు.
Similar News
News September 17, 2025
శాసన సభ స్పీకర్‌ను కలిసిన గుంటూరు ఎస్పీ

గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వకుల్ జిందాల్ బుధవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడంతోపాటు పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని స్పీకర్ సూచించారు. జిల్లా శాంతిభద్రతల పరిరక్షణలో, నేరాల నిర్మూలనలో కఠిన చర్యలు తీసుకొని ప్రజా భద్రతను కాపాడాలని స్పష్టం చేశారు.
News September 17, 2025
వెలగపూడి: బీసీ రక్షణ చట్టంపై మంత్రి అనగాని సమీక్ష

బీసీల రక్షణ కోసం చట్టం రూపొందించడంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ బుధవారం వెలగపూడి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సమగ్ర బీసీ రక్షణ చట్టం తీసుకురావడానికి కసరత్తు జరుగుతోందని ఆయన తెలిపారు. ఈ చట్టం అమలులో ఎదురయ్యే సవాళ్లు, వాటి పరిష్కారాలపై సహచర మంత్రులతో ఆయన చర్చించారు. బీసీల హక్కుల రక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.
News September 17, 2025
రేపు వెంకటపాలెంలో NTR విగ్రహానికి నివాళులర్పించనున్న సీఎం

రాష్ట్ర సచివాలయంలో గురువారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించనున్నారు. ఉదయం 8 గంటలకు పూలమాలలు వేసి ఆయన నివాళులు అర్పిస్తారని తాడికొండ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం తెలిపింది. అనంతరం అక్కడి నుంచి అసెంబ్లీకి బయలుదేరతారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.