News July 11, 2024

దారుణం: బాలికలను కరిచిన ఎలుకలు

image

TG: మెదక్ జిల్లా రామాయంపేట గురుకుల పాఠశాలలో దారుణం జరిగింది. అక్కడ చదివే 12 మంది బాలికలను ఎలుకలు కరిచాయి. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. పాఠశాల నిర్వాహకులపై తల్లితండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కామారెడ్డి(D) దేశాయ్‌పేట ప్రభుత్వ పాఠశాల హెడ్‌మాస్టర్‌పై పోక్సో కేసు నమోదైంది. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని తేలడంతో ఆయనతో పాటు మరో 9 మందిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

Similar News

News March 18, 2026

కావ్యా.. కాల్ చెయ్: లలిత్ మోదీ

image

పాక్ బౌలర్ అబ్రార్‌ను సన్‌రైజర్స్ కొనుగోలు చేసిన <<19366541>>వివాదం<<>>లోకి IPL ఫౌండర్ లలిత్ మోదీ ఎంటర్ అయ్యారు. ‘ఫ్యాన్స్ ఆవేశంలో ఉన్న సమయంలో ఒక పాక్ ప్లేయర్‌పై ₹2.34 కోట్లు ఇన్వెస్ట్ చేయడమా? ప్రజాభిప్రాయాన్ని ఎలా మేనేజ్ చేయాలో, సామ్రాజ్యాలను ఎలా నిర్మించాలో నాకు బాగా తెలుసు. నాకు కాల్ చెయ్’ అంటూ పరోక్షంగా SRH ఓనర్‌ కావ్యా మారన్‌ను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు.

News March 18, 2026

₹2.40 లక్షలిస్తాం.. ఇండియాకు వెళ్లిపోండి: US

image

అక్రమ వలసదారులు తమ దేశం విడిచి వెళ్లాలని US మరోసారి కోరింది. చట్టవిరుద్ధంగా నివసిస్తున్నందుకు వేసిన ఫైన్స్‌ను రద్దు చేయడంతో పాటు ఫ్రీగా ఫ్లైట్ టికెట్లు అందజేస్తామని పేర్కొంది. అలాగే ₹2,40,329 ఎగ్జిట్ బోనస్ కింద ఇస్తామని తెలిపింది. ఈ క్రమంలో అక్కడి హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ ప్రకటనతో పాటు తాజ్‌మహల్ ఫొటోను పోస్ట్ చేసి ‘Fly to India For Free’ అంటూ రాయడం చర్చనీయాంశమైంది.

News March 18, 2026

జనం సెక్సువల్ కంటెంట్ చూస్తున్నారు: రక్షిత

image

‘KD: ది డెవిల్’ సినిమాలోని ‘సర్కే చునర్’ పాట అసభ్యంగా ఉందన్న <<19406830>>విమర్శల<<>>పై డైరెక్టర్ ప్రేమ్ భార్య, మాజీ నటి రక్షిత స్పందించారు. గతంలో వచ్చిన ఈ తరహా పాటలకులేని అభ్యంతరం ఇప్పుడెందుకని ప్రశ్నించారు. ప్రస్తుతం జనం రక్తపాతం, సెక్సువల్ కంటెంట్‌ను చూస్తున్నారని, కేవలం ఒక్క పాటతో తన భర్తను వ్యక్తిగతంగా దూషించడం సరికాదని మండిపడ్డారు. కన్నడ సినిమాలను థియేటర్లకు చేర్చడం ఎంత కష్టమో అర్థం చేసుకోవాలని కోరారు.