News July 11, 2024

అంబానీ ఇంట పెళ్లి వేడుక.. అతిథుల కోసం 100 విమానాలు

image

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహానికి సర్వం సిద్ధమైంది. వీరి పెళ్లికి దేశీయ ప్రముఖులతోపాటు విదేశీ సెలబ్రిటీలు కూడా హాజరుకానున్నారు. వారిని తరలించేందుకు ఏకంగా 100 విమానాలు, మూడు ఫాల్కన్ జెట్‌లను అంబానీ ఫ్యామిలీ ఏర్పాటు చేసింది. పెళ్లి తర్వాత కూడా వారిని తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు వీటిని ఉపయోగించనున్నారు. అనంత్-రాధిక వివాహం రేపు ముంబైలో జరగనుంది.

Similar News

News April 2, 2026

ఒళ్లంతా సిందూరం.. ఇదే హనుమ కథ

image

హనుమంతుడు ఒళ్లంతా సిందూరం పూసుకొని ఉండటం వెనుక ఓ ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. సీతమ్మ తన నుదుటన సిందూరం ధరించడం వెనుకున్న విశేషాన్ని హనుమ అడిగారట. శ్రీరాముడి ఆయురారోగ్యాల కోసమని ఆమె చెప్పడంతో.. తన ప్రభువుకి మరింత మేలు జరుగుతుందని ఆంజనేయుడు దానిని తన శరీరం అంతటా పూసుకుంటాడు. ఆయన అమాయకత్వంతో కూడిన భక్తికి ముగ్ధుడైన రాముడు.. సిందూరంతో హనుమను పూజించే భక్తులకు అన్ని కష్టాలు తొలగుతాయని వరం ఇచ్చారు.

News April 2, 2026

హనుమాన్: భక్తుడే కాదు.. గొప్ప రక్షకుడు కూడా!

image

హనుమంతుడు శ్రీరాముడి పరమ భక్తుడే కాదు. ఆపదల్లో ఆదుకునే రక్షకుడు కూడా. అందుకు కురుక్షేత్రంలోని ఈ ఘటనే నిదర్శనం. యుద్ధంలో అర్జునుడి రథంపై హనుమాన్ ఉంటాడన్న విషయం తెలిసిందే. అయితే ఆ యుద్ధం ముగిశాక అర్జునుడు రథం దిగిన వెంటనే అది బూడిదైంది. శత్రువులు వేసిన అస్త్రాల శక్తిని కృష్ణుడితో పాటు హనుమంతుడు కూడా తన దివ్యశక్తితో ఆపి, అర్జునుడిని కాపాడాడు. అందుకే హనుమంతుడిని ఆపద్బాంధవుడు అంటారు.

News April 2, 2026

హనుమంతుడికి 5 ముఖాలు ఎలా వచ్చాయి?

image

రామరావణ యుద్ధంలో మైరావణుడు రామలక్ష్మణులను అపహరించి పాతాళంలో బంధిస్తాడు. అతడిని అంతం చేయాలంటే 5 దీపాలు ఒకేసారి ఆర్పాలి. అందుకే హనుమాన్ పంచముఖ రూపం ధరించి, ఆ దీపాలను ఆర్పి మైరావణుడిని వధించాడు. దుష్టశిక్షణ కోసం ఉద్భవించిన ఈ మహోగ్ర రూపం భక్తులకు సర్వ శుభాలను చేకూరుస్తుందని నమ్మకం. పంచముఖ హనుమత్ స్తోత్రం జపించి, ఆయనను పూజిస్తే దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.