News July 11, 2024
క్యాండీ క్రష్‌కు బానిసైన టీచర్.. సస్పెండ్ చేసిన అధికారులు
విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా క్యాండీ క్రష్ గేమ్‌కు బానిసైన GOVT టీచర్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటన UPలోని సంభాల్‌లో జరిగింది. ఇటీవల మేజిస్ట్రేట్ రాజేంద్ర ఆ స్కూల్‌లో తనిఖీ చేశారు. విద్యార్థుల పుస్తకాల్లో అన్నీ తప్పులే ఉండటంతో టీచర్ ప్రియమ్‌ను ప్రశ్నించారు. అతను స్కూల్ టైమ్‌లో 2 గంటలు క్యాండీ క్రష్ ఆడి, అరగంట కాల్స్ మాట్లాడినట్లు గుర్తించారు. మేజిస్ట్రేట్ ఆదేశాలతో టీచర్‌పై వేటు పడింది.
Similar News
News January 19, 2025
మా అమ్మకు పద్మ అవార్డు కోసం ఎంతో ప్రయత్నించా: నరేశ్
ఇండియాలో 46 సినిమాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళ విజయ నిర్మలకు పద్మ అవార్డు రాకపోవడంపై కొడుకు నరేశ్ విచారం వ్యక్తం చేశారు. అమ్మకు పురస్కారం కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయిందన్నారు. బీజేపీ వచ్చిన తర్వాత స్థాయి ఉన్న వ్యక్తులకు అవార్డులు ఇస్తున్నారని చెప్పారు. తెలుగు ఇండస్ట్రీలోనూ అలాంటి వారు ఉన్నారని, వారికి పురస్కారాల కోసం నిరాహార దీక్ష చేసినా తప్పులేదని వ్యాఖ్యానించారు.
News January 19, 2025
ఇండో-కొరియన్ హారర్ కామెడీ జోనర్‌లో వరుణ్ కొత్త చిత్రం
‘మట్కా’ డిజాస్టర్ తర్వాత వరుణ్ తేజ్ కొత్త చిత్రాన్ని ప్రకటించారు. మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ మూవీ ఇండో కొరియన్ హారర్ కామెడీ జోనర్‌లో ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఇవాళ వరుణ్ బర్త్‌డే సందర్భంగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘కదిరి నరసింహసామి సాచ్చిగా ఈ తూరి నవ్వించేకి వస్తుండా’ అని మెగా ప్రిన్స్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తారు.
News January 19, 2025
ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం.. తన కొడుకును ఉరి తీయాలన్న తల్లి
కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో సంజయ్ రాయ్‌ను కోర్టు దోషిగా తేల్చడంపై అతని తల్లి మాలతి(70) స్పందించారు. తన కొడుకు చేసిన తప్పును మహిళగా క్షమించబోనని స్పష్టం చేశారు. తనకూ ముగ్గురు కుమార్తెలు ఉన్నారని, వైద్యురాలి తల్లి బాధను అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు. అతడికి మరణ శిక్ష విధించినా అభ్యంతరం లేదన్నారు. ఈ కేసుపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఉద్దేశం తమకు లేదని సంజయ్ సోదరి కూడా తేల్చిచెప్పారు.