News July 11, 2024
చరిత్ర సృష్టించేందుకు అడుగుదూరంలో..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి’ సినిమా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరేందుకు సిద్ధమైంది. నేటి కలెక్షన్లతో ఇది పూర్తయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే జరిగితే రెండు సినిమాల్లో రూ.వెయ్యి కోట్ల చొప్పున (బాహుబలి2, కల్కి) సాధించిన తొలి దక్షిణ భారత నటుడిగా ప్రభాస్ చరిత్ర సృష్టించనున్నారు. రేపు కమల్ హాసన్ ‘భారతీయుడు-2’ రిలీజ్ కానుండటంతో దీని ప్రభావం ‘కల్కి’ కలెక్షన్లపై పడనుంది.
Similar News
News September 18, 2025
హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న శంకర్ తనయుడు!

తమిళ డైరెక్టర్ శంకర్ తనయుడు ఆర్జిత్ శంకర్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ప్యాషన్ స్టూడియోస్ నిర్మాణంలో అశోక్ అనే డెబ్యూ డైరెక్టర్‌తో ఆయన సినిమా చేయబోతున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. అర్జిత్ కొన్నేళ్లుగా సినీ పరిశ్రమలో మురుగదాస్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
News September 18, 2025
అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లు తగ్గింపు

వడ్డీరేట్ల విషయంలో అమెరికా ఫెడరల్ రిజర్వు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాదిలో తొలిసారి వడ్డీరేట్లను తగ్గించింది. 25 బేసిస్ పాయింట్లు మేర కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అమెరికాలో వడ్డీరేట్లు 4 శాతం నుంచి 4.5 శాతం రేంజ్‌కు చేరాయి. ద్రవ్యోల్భణం పెరుగుతున్నా.. జాబ్ మార్కెట్ మందగిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
News September 18, 2025
అర్ధరాత్రి 5 కి.మీ. మేర ట్రాఫిక్ జామ్

TG: భారీ వర్షం హైదరాబాద్ మహా నగరాన్ని అతలాకుతలం చేసింది. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షానికి చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపైకి వర్షపునీరు చేరడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. అర్ధరాత్రైనా చాలామంది ఇళ్లకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. బేగంపేట-సికింద్రాబాద్ రూట్‌లో 5 కి.మీ. మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు హైడ్రా, ట్రాఫిక్, పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.