News July 11, 2024
నీట్ పేపర్ లీకేజీ.. కీలక సూత్రధారి అరెస్ట్
నీట్ పేపర్ లీకేజీ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న రాజేశ్ రంజన్ అనే వ్యక్తిని CBI అధికారులు పట్నాలో అరెస్ట్ చేశారు. నిందితుడిని స్థానిక కోర్టు 10రోజుల సీబీఐ కస్టడీకి అనుమతించింది. అలాగే పట్నా, కోల్‌కతాలో సోదాలు చేసిన CBI.. కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకుంది. ఇప్పటి వరకు ఈ కేసులో పది మందికి పైగా అరెస్ట్ అయ్యారు. కాగా నీట్ లీకేజీపై దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు జులై 18కి వాయిదా వేసింది.
Similar News
News January 19, 2025
ఓ పెళ్లి కాని ప్రసాదులూ..! ఇది చదవండి..!!
ప్రయత్నిస్తే ప్రధాని కావచ్చేమో, పెళ్లి మాత్రం ఈ జన్మకి డౌటే! ఇది ఈ మధ్య వింటున్న ఫన్ ఫ్యాక్ట్. మారిన పరిస్థితులు, అమ్మాయిల ఆలోచనా విధానం, కొన్ని కులాల్లో అమ్మాయిల కొరతతో చాలామందికి వివాహాలు జరగడం లేదు. వ్యవసాయం, కుల వృత్తులు చేస్తున్నా, ఊర్లలో ఉన్నా మ్యాచ్ రావట్లేదనేది మ్యారేజ్ బ్రోకర్స్ మాట. పెళ్లి ఖర్చు సహా అమ్మాయికి అన్నీ తామే చూసుకుంటామన్నా కొందరికి సెట్ కాట్లేదట. మీ పరిస్థితి కూడా ఇదేనా?
News January 19, 2025
దేశంతోనూ పోరాడుతున్నామన్న రాహుల్.. FIR ఫైల్
BJP, RSSతోపాటు దేశంతోనూ కాంగ్రెస్ పోరాడుతోందన్న లోక్‌సభ పక్షనేత రాహుల్ గాంధీపై మోన్‌జిత్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో గువాహటి పోలీస్‌స్టేషన్‌లో ఆయనపై FIR నమోదైంది. రాహుల్ వ్యాఖ్యలు వాక్‌స్వాతంత్య్ర పరిమితులను దాటాయని, అవి జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తాయని మోన్‌జిత్ ఆరోపించారు. ఇటీవల ఢిల్లీలో INC కొత్త కార్యాలయ ప్రారంభోత్సవంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
News January 19, 2025
మా అమ్మకు పద్మ అవార్డు కోసం ఎంతో ప్రయత్నించా: నరేశ్
ఇండియాలో 46 సినిమాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళ విజయ నిర్మలకు పద్మ అవార్డు రాకపోవడంపై కొడుకు నరేశ్ విచారం వ్యక్తం చేశారు. అమ్మకు పురస్కారం కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయిందన్నారు. బీజేపీ వచ్చిన తర్వాత స్థాయి ఉన్న వ్యక్తులకు అవార్డులు ఇస్తున్నారని చెప్పారు. తెలుగు ఇండస్ట్రీలోనూ అలాంటి వారు ఉన్నారని, వారికి పురస్కారాల కోసం నిరాహార దీక్ష చేసినా తప్పులేదని వ్యాఖ్యానించారు.