News July 11, 2024
బియ్యం or రోటీ: బరువు తగ్గేందుకు ఏది బెటర్?

బరువు తగ్గాలని చాలామంది ఆహారంలో మార్పులు చేస్తుంటారు. కొంతమంది రాత్రిపూట భోజనం మానేస్తుంటారు. సమతుల్య ఆహారం తీసుకుంటే బరువును తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. బియ్యం, రోటీ రెండూ ఆరోగ్యకరమైనవే. కానీ గోధుమ రొట్టెలో అధిక ఫైబర్, ప్రొటీన్, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల బరువు తగ్గేందుకు కొంత వెసులుబాటు ఉంది. ఒక్కోసారి తెలియకుండా వైట్ రైస్ ఎక్కువగా తినడం వల్ల కొంచెం బరువు పెరుగుతారు.
Similar News
News April 6, 2026
RBI వడ్డీ రేట్లు మారకపోవచ్చు: ఎకనమిస్టులు

వడ్డీ రేట్లలో RBI ఎలాంటి మార్పులు చేయకపోవచ్చని, యథాతథంగా కొనసాగించవచ్చని ఎకనమిస్టులు అంచనా వేస్తున్నారు. రూపాయి పడిపోవడం, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో రేట్ల సవరణకు మొగ్గుచూపకపోవచ్చని అంటున్నారు. గత సమీక్షలోనూ రెపో రేటును 5.25 శాతం వద్దే <<19064412>>కొనసాగించడం<<>> తెలిసిందే. RBI MPC 3 రోజుల సమీక్ష ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. కమిటీ నిర్ణయాలను 8వ తేదీన RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా మీడియాకు వెల్లడించనున్నారు.
News April 6, 2026
DSP అవినీతి.. పనిమనిషికే బంగ్లా, థార్ కారు

బిహార్‌కు చెందిన DSP గౌతమ్ కుమార్ అవినీతి కేసులో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. ఆయన ఇంట్లో పనిచేసే మహిళకు ₹కోటి బంగ్లా, థార్ కారు ఉన్నట్లు తేలడం ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను విస్మయానికి గురిచేసింది. ఆయన భార్య, గర్ల్‌ఫ్రెండ్ కూడా లగ్జరీ లైఫ్ గడుపుతున్నట్లు తాజా విచారణలో తేలింది. సోదాల్లో సుమారు ₹80 కోట్ల విలువైన ప్రాపర్టీలు బయటపడ్డాయి. ఆయన్ను సస్పెండ్ చేసి బ్యాంక్ అకౌంట్లపై దృష్టి పెట్టారు.
News April 6, 2026
GK: ముఖ్య పదవులు.. కనీస వయసు

*రాష్ట్రపతి- 35 ఏళ్లు
*ఉపరాష్ట్రపతి- 35
*గవర్నర్- 35
*ఎమ్మెల్సీ- 30
*రాజ్యసభ సభ్యుడు- 30
*ప్రధాని- 25
*లోక్‌సభ ఎంపీ- 25
*ఎమ్మెల్యే- 25
*సీఎం- 25
*సర్పంచ్- 21


