News July 11, 2024
HYD: ఇంటర్ విద్యార్థి మృతి

విద్యుత్ షాక్‌తో ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. RR జిల్లా నందిగామ మండల కేంద్రానికి చెందిన బన్నీ(18) ఇంట్లో ఉన్న నీటి సంపులో మోటార్ కు వైర్లు బిగిస్తున్నాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై కుప్పకూలాడు. అపస్మారక స్థితిలో ఉన్న బన్నీని కుటుంబీకులు షాద్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Similar News
News December 25, 2025
NEW YEAR: HYDలో సరికొత్తగా!

HYDలో న్యూ ఇయర్ వేడుకలు కేవలం పబ్‌లకే పరిమితం కాకుండా ‘ఓపెన్ టు ఆల్’ పద్ధతిలో సాగనున్నాయి. పర్యాటక శాఖ బాణసంచా కాలుష్యాన్ని అరికట్టేందుకు ట్యాంక్‌బండ్, చార్మినార్ వద్ద మెగా డ్రోన్ షోలను ప్లాన్ చేస్తోంది. హైడ్రా పునరుద్ధరించిన చెరువుల గట్లపై తొలిసారిగా లైవ్ మ్యూజిక్, ఫుడ్ స్టాల్స్‌తో వేడుకలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ట్రాఫిక్ చిక్కులు లేకుండా నగరం వెలుపల 3 భారీ కౌంట్‌డౌన్ ఈవెంట్లకు అనుమతించింది.
News December 25, 2025
హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్..

HYDలో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్‌కి చేరింది. చలికాలం పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతోంది. డబుల్ డిజిట్‌లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ గురువారం తెల్లవారుజామున 240కి చేరింది. శ్వాసకోస వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలు అని డాక్టర్లు సూచిస్తున్నారు. తెల్లాపూర్ ఏరియాలో 422గా నమోదు అయింది.
SHARE IT
News December 25, 2025
హైదరాబాద్‌లో Christmas Vibes

హైదరాబాద్‌లో క్రిస్మస్ జోష్ మరో లెవల్‌లో ఉంది. గతేడాది కంటే జనం తాకిడి 15% పెరిగిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. కొన్ని చర్చిల్లో ‘రీసైకిల్డ్ ట్రీ’తో ఎన్విరాన్మెంట్ మెసేజ్ ఇస్తున్నారు. ఇక సికింద్రాబాద్ మేరీస్ చర్చి దగ్గరైతే ఎటు చూసినా వెలుగులే. లాలాగూడలో మన ఆంగ్లో-ఇండియన్స్ పాతకాలం నాటి ‘లిటిల్ ఇంగ్లాండ్’ని కళ్ల ముందు ఉంచారు. యువత ‘క్రిస్మస్ హగ్’ సిటీకి కొత్త అందాన్ని తెచ్చింది.Mery Christmas


