News July 11, 2024
డీఎస్సీ హాల్‌టికెట్లు విడుదల

TG: ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు జరగనున్న డీఎస్సీ పరీక్షల హాల్‌టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. <
Similar News
News April 2, 2026
బెంగాల్‌లో రాష్ట్రపతి పాలనకు BJP కుట్ర: మమతా బెనర్జీ

కేంద్రం, ఎన్నికల సంఘంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. మాల్దాలో జుడీషియల్ అధికారుల బందీపై తనకు సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని చూపిస్తూ అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేసి ‘రాష్ట్రపతి పాలన’ విధించాలని BJP కుట్ర పన్నుతోందని ఆరోపించారు. పరిపాలన అంతా ఎన్నికల సంఘం చేతుల్లోనే ఉందని, అధికారుల రక్షణలో అది విఫలమైందని విమర్శించారు.
News April 2, 2026
మిలియన్ డాలర్ల కెరీర్‌ను కాదనుకొని సన్యాసిగా!

₹కోట్లలో జీతం, లగ్జరీ లైఫ్.. ఏ గ్రాడ్యుయేట్‌కైనా ఇదొక కల. కానీ 1985 IIT-JEEలో ఆలిండియా రెండో ర్యాంక్ సాధించి IIT కాన్పూర్‌లో చేరిన శ్రీష్ జాదవ్ మాత్రం అన్నింటినీ వదిలేసి ఆధ్యాత్మిక బాట పట్టారు. చదువు పూర్తికాగానే భారీ ప్యాకేజీతో ఉద్యోగం, విదేశాలకు వెళ్లే అవకాశం ఉన్నా అవేవీ తనకు సంతృప్తి ఇవ్వవని గ్రహించారు. మనశ్శాంతి కోసం మిలియన్ డాలర్ల కెరీర్ కాదనుకొని సన్యాసం స్వీకరించి ఇస్కాన్‌లో చేరారు.
News April 2, 2026
గ్రూప్-1 నియామకాల పిటిషన్ డిస్మిస్

TG: గ్రూప్-1 నియామకాల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పరీక్షలో అక్రమాలు కనిపించలేదని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని, తమ వాదనలు పరిగణనలోకి తీసుకోకుండానే హైకోర్టు తీర్పు ఇచ్చిందని పలువురు అభ్యర్థులు SCని ఆశ్రయించారు. ఈ క్రమంలో TGPSCలో అక్రమాలు జరగలేదని, నియామకాలు సరిగ్గానే జరిగాయని పిటిషన్‌ను SC డిస్మిస్ చేసింది.


