News July 11, 2024
ట్రైనీ IAS పూజ వ్యవహారంపై విచారణ కమిటీ

అధికారాలను దుర్వినియోగం చేసిన ట్రైనీ IAS <<13605832>>పూజా<<>> ఖేద్కర్ వ్యవహారంపై కేంద్రం చర్యలు చేపట్టింది. ఇంటర్వ్యూ సమయంలో ఆమె సమర్పించిన ధ్రువపత్రాలను పరిశీలించేందుకు ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 2 వారాల్లో తన నివేదికను సమర్పించనుంది. మరోవైపు వివాదం నేపథ్యంలో పుణేలోని పూజ ఇంటికెళ్లిన మీడియాపై ఆమె తల్లి చిందులు తొక్కారు. కెమెరామెన్లపై అరుస్తూ తోసేసిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
Similar News
News September 15, 2025
ప్రియుడితో కలిసి భర్త చెవులు కోసేసిన భార్య

TG: ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్త చెవులు కోసేసిన ఘటన మహబూబాబాద్(D)లో జరిగింది. మహబూబాబాద్ మండలం గడ్డిగూడెం తండాకు చెందిన మహిళకు గంగారం(M) మర్రిగూడేనికి చెందిన అనిల్‌తో వివాహేతర సంబంధం ఉంది. ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు ప్లాన్ చేసింది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి అతడి చెవులు కోసేయగా ప్రాణ భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశాడు. అనంతరం పారిపోయేందుకు యత్నించిన ప్రియుడిని స్థానికులు పట్టుకొని చితకబాదారు.
News September 15, 2025
రాష్ట్రానికి అదనంగా 40వేల MT యూరియా

TG: రాష్ట్రానికి మరో 40వేల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఈ వారంలో రాష్ట్రానికి 80వేల MT సరఫరా కానుంది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం సాగులో ఉన్న వరి, మొక్కజొన్న, పత్తికి యూరియా ఎంతో అవసరం. ఈ పంటలకు రానున్న 15 రోజులు చాలా కీలకం. అందుకే రైతుల అవసరాలకు తగ్గట్టుగా యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని <<17720342>>కోరాం<<>>’ అని వెల్లడించారు.
News September 15, 2025
MBBS అడ్మిషన్స్.. మెరిట్ లిస్ట్ రిలీజ్

TG: MBBS కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి అభ్యర్థుల ఫైనల్ మెరిట్ లిస్ట్‌ను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసింది. ఇక్కడ <